Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లాభం రూ.3,357 కోట్లు

hdfcముంబయి: డిసెంబర్ 31 ముగింపు నాటి మూ డో త్రైమాసిక ఫలితాల్లో దేశీయ రెండో అతిపెద్ద రుణదాత సంస్థ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అంచ నాలను అందుకుంది. సంస్థ నికర లాభం రూ. 3,357 కోట్లతో 20 శాతం వృద్ధిని సాధించింది. గత సంవత్సరం బ్యాంకు లాభం రూ.2,795 కోట్లుగా ఉంది. నికర వడ్డీ ఆదాయం రూ.7,068.50 కోట్లతో 24 శాతం పెరిగింది. ఇతర ఆదాయం రూ.2,872 కోట్లతో 30 శాతం వృద్ధిని సాధించింది. గత మూడు నెలల్లో స్థూల నిరర్థక రుణాలు 0.91 శాతం నుంచి 0.97 శాతానికి పెరిగాయి. దేశీయ బ్యాంకులు డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో అధిక మొండి బకాయిలను ఉద్దేశించి ఆర్‌బిఐ కూడా హెచ్చరించింది. బ్యాంకులు మొండి బకాయిల విషయంలో ఎవరినీ లెక్కచేయవద్దని సూచిం చింది. బ్యాంక్ మొత్తం డిపాజిట్లు రూ.5,23,997 కోట్లతో 26.5 శాతం పెరగ్గా, అడ్వాన్సులు రూ.4,36,364 కోట్లతో 25.7 శాతం వృద్ధిని సాధించాయి.

Comments

comments