Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఓరి నీ ప్రేమ ‘ఐఫోన్’ కాను…!

25-iPhone-X-units-to-propos

బీజింగ్: చైనాలో ఓ యువకుడు తన ప్రేయసికి లవ్ ప్రపోజ్ చేసిన విధానం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మనోడు మాములుగా ప్రేమ ప్రపోజ్ చేయలేదు. చాలా కాస్ట్‌లీ ప్రపోజల్. ఎంత అంటరా… సుమారు 31,000 డాలర్లు(ఇండియన్ కరెన్సీలో రూ. 25.5 లక్షలు) విలువ చేసే పాతిక ‘ఐఫోన్ 10’ మొబైల్స్ కొని, వాటిని హార్ట్ ఆకారం పేర్చి మధ్యలో పెళ్లి రింగ్‌ను ఉంచాడు. అనంతరం తన ప్రేయసి ముందు మోకరిల్లి పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరాడు. అది విన్న ఆ ప్రేయసికి నోట మాట రాలేదట. వెంటనే ప్రేమికుడికి పెళ్లి ప్రపోజల్‌కు ఓకే చెప్పేసింది. అయితే ఇదంతా చూసిన వారిలో కొందరికి అది పిచ్చితనంగా అనిపిస్తే మరికొందరిని మాత్రం ఆశ్చర్యానికి గురిచేసింది. వారిలో కొందరు ఆ ప్రేమికుడికి ఇలా పాతిక లెటేస్ట్ ఐఫోన్లు ఇచ్చి నీ ప్రేమను తెలుపడానికి గత కారణమేంటని ప్రశ్నించారు. దీనికి ఆ యువకుడు… నా ప్రేయసికి స్మార్ట్‌ఫోన్లలో గేమ్స్ ఆడటమంటే చాలా ఇష్టం. అందుకే తాజాగా విడుదలైన ‘ఐఫోన్ 10’ ఫోన్లు గిఫ్ట్‌గా ఇచ్చాను. మరి 25 మొబైల్స్ ఇవ్వడం వెనుక కథేంటి అని అడగగా… నా ప్రియురాలి వయసు పాతికేళ్లు అని చెప్పాడు. ప్రేయసి తన పెళ్లి ప్రపోజల్‌ను ఒప్పుకోవడంతో ఆ ప్రేమికుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ ఆనందంలో ఆ యువకుడు తన ప్రియురాలిని మెప్పించడంలో సహాయపడిన మిత్రులందరికీ తలో ‘ఐఫోన్ 10’ బహుమతిగా ఇచ్చేశాడు.

Propose

Friends

Comments

comments