Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

కన్న బిడ్డలనే కడతేర్చాడు

ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేసిన తండ్రి
కారణాలు అనేకం భిన్నాభిప్రాయాలు వ్యక్తం
కొనసాగుతున్న ఆందోళన
తండ్రి ఆత్మహత్య..భూ వివాదమే ఈ హత్య కారణమని భార్య ఆరోపణ
కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

                   murder

నిజామాబాద్‌ప్రతినిధి: కన్న బిడ్దల నే అ కసాయి తండ్రి కడతెర్చాడు. భార్య లేని సమ యంలో ఈ ఘటనకు ఒడిగట్టాడు. చివరకు తాను ఆత్మహత్య చేసుకున్నాడు.తండ్రి తన ఇద్దరు పిల్లలను అత్యంత దారుణంగా చంపి, ఉరి వేసుకొని ఆత్మహ త్య చేసుకున్నాడు. భార్య కూలీ పనికి వెళ్లి విషయం తెలుసుకొని ఇంటికి వచ్చి లాబోదిబోమంటు బోరున విలపించింది. వర్ని మండలం తగిలేపల్లి గ్రామంలో జరిగిన సంఘటనతో గ్రామంలో విషాదచాయాలు లముకున్నాయి.ఈ సంఘటనపై స్థానికంగా భిన్నభి ప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

తండ్రికి సంబంధి ంచిన కుటుంబ సభ్యులు మాత్రం పలు అనుమా నాలు వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క మతిస్థిమితం లే కనే ఇద్దరు పిల్లలను తండ్రి హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు సైతం కేసు నమోదు చేసి దర్యాప్లు చేస్తున్నారు. వర్ని మండలం తగిలేపల్లి గ్రామంలో జరిగిన ఈ సంఘ టనకు పాల్పడింది రాములు(32), తన కుమారుడు చరణ్(9), కూతురు శరణ్య(6)లను దారుణంగా చంపిన ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మా రింది. బుధవారం రాత్రి వరకు కూడా కుటుంబ స భ్యులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఘటనపై వాస్తవా లను వెలికి తీయాలని డిమాండ్ చేస్తు మృతదేహాలను తీయ్యకుండా అడ్డుకుంటున్నారు.

దారుణం… దయనీయం..

ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసింది భూ వివాదం. భూ వివాదంలో పడిన తండ్రి కసాయిగా మారింది ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేయడం హృదయ విదా రకంగా మారింది. ఈ సంఘటన స్థలాన్ని చూసిన వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తండ్రి ప్రేమ పంచాల్సిన వ్యక్తి ఇంతటి క్రూరంగా హత్య చేయడం ఏమిటీనే ప్రశ్నలు మనసులను తొలుస్తున్నారు. ఉద యం పాఠశాలకు తయారు అయి వెళ్లిన ఇద్దరు ల్లలను వెనక్కి రప్పించిన తండ్రి మిట్టా మద్యాహ్నం తర్వాత ఇంట్లో టివి సౌండ్ ఎక్కువగా పెట్టి, పిల్లల నోట్లో బట్టలు కుక్కి మరి గొడ్డలితో అత్యంత దారు ణంగా హత్య చేయడం నమ్మలేకుండా ఉంది. పిల్లల ను హత్య చేసిన తండ్రే ఉరి వేసుకొని ఆత్మహత్య చే సుకోవడం చర్చనీయాంశంగా మారింది. మంగళవా రం రాత్రి రాములు కుటుంబ సభ్యులతో ఘర్షణకు దిగినప్పటికి, ఎప్పటిలాగే ఉంటు ఉదయం తన కా ర్యక్రమాలను ముగించుకున్నట్లు భార్య చెబుతున్నా రు. కాని భార్య కూలీ పనికి వెళ్లిన తర్వాతనే ఇంతటి దారుణానికి దిగడంతో ప్రతి ఆశ్యర్యం పోతున్నారు.

కారణాలు అనేకం…

రాములు ఘటనపై భిన్నభిప్రాయాలే కాకుండా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవాలను పరిశీలిస్తే సొంత పిల్లలను అత్యంతదారుణంగా చం పడం వెనక పలు కారణాలు ఉన్నట్లు స్థానికులు చెచు తున్నారు. కూలీకి వెళ్లిన భార్య సుజాత సైతం ఇంట్లో హత్యకు గురయ్యేదని కుటుంబ సభ్యులు అంటు న్నారు. ఇటీవల రాములు అన్నదమ్ములకు మద్య భూ తగాదాలు జరగడం, పలుమార్లు ఘర్షణలకు దిగడంతో పాటు వ్యవహారం పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది. అక్కడ కూడా పరిష్కారం కాకపోవడంతో వి చారణలో జాప్యం జరుగుతు వస్తుంది. దీంతో మరో సారి అన్నదమ్ముల మధ్య వివాదానికి కారణం అ యింది. అప్పటికే ఈ వ్యవహారంలో రాములు మా నసిక ఒత్తిడికి గురైనట్లు చెబుతున్నారు. మానసిక ఒ త్తిడి కారణాలతో పాటు వివాదాలతో విసిగి ఈ ఘ టనకు పాల్పడినట్లు స్థానికులు వాదిస్తున్నారు. ఇటీ వల అన్నదమ్ముల వివాదంతోనే రాములు ఈ తర హాలో ఘటనకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కొనసాగుతున్న ఆందోళన

పిల్లలను చంపి,తాను ఆత్మహత్య చేసుకున్న ఘట నపై మృతుని భార్య కుటుంబసభ్యులు ఆందోళన చే స్తున్నారు. సుమారు నాలుగు గంటల పాటు ఆందో ళన చేస్తున్నారు. ఈ ఘటనకు కారకులు అయిన వా రిపై చర్యలు తీసుకొవాలని ఆందోళన చేస్తు పంచ నామా చేసేందుకు కూడా పోలీసులను రానివ్వడం లేదు. రాములు మానసిక స్థితి కారణం అయిన అయన అన్నదమ్ములపై చర్య తీసుకొవాలని మృతుని భార్య కుటుంబాలు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు,.

Comments

comments