Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

ప్రేమ ఒకరితో.. పెళ్లి మరొకరితో

పెళ్లి మండపంలో బైఠాయించిన ప్రియురాలు
పోలీసుల జోక్యంతో  ఆగిపోయిన వివాహం

love

గొల్లపల్లి: ప్రేమించిన యువతిని కాదని మరో యువతితో ఓ యువకుడు పెళ్లికి సిద్ధమవ్వగా విషయం తెలుసుకున్న ప్రియురాలు పెళ్లి మండపంలో బైఠాయించి నిరసన తెలుప డంతో ఆ వివాహం ఆగిపోయిన సంఘటన జగి త్యాల జిల్లా గొల్లపల్లిలో చోటు చేసుకుంది. పోలీ సుల కథనం ప్రకారం.. కొడిమ్యాల మండలం రాంకిష్టాపూర్ గ్రామానికి చెందిన ఎలుగుర్తి దీప అదే మండలం నాచుపెల్లి గ్రామానికి చెందిన తు ర్పాటి కుమార్ గత నాలుగేళ్లుగా ప్రేమించుకుం టున్నారు. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చిన కుమార్ గొల్లపల్లికి చెందిన మరో యువతితో పెళ్ళికి సిద్ధమయ్యాడు.

బుధవారం ఉదయం వివాహం జరగనుండగా విషయం తెలుసుకున్న ప్రియురాలు దీప గొల్లపల్లికి చేరుకొని పెళ్ళి జరిగే స్థలానికి వచ్చి బైఠా యించింది. తనను ప్రేమించి మోసగించాడని, మరో యువతితో పెళ్ళికి సిద్ధమ య్యాడంటూ గొడవకు దిగడంతో పెళ్ళి మండ పంలో వివాదం చెలరేగింది. దీంతో పోలీసులు చేరుకొని ఇరువర్గాల బంధువులతో మాట్లాడారు. ప్రేమించి మోసగించిన కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేయడంతో వివాహం కాస్తా ఆగిపోయింది. అయితే తను కుమార్‌ను మరెవ్వ రినీ పెళ్లి చేసుకోనని దీప స్పష్టం చేసింది.

Comments

comments