Home తాజా వార్తలు మాజీ సిఎం ఇంట్లోకి చొరబడేందుకు యత్నించిన వ్యక్తి కాల్చివేత

మాజీ సిఎం ఇంట్లోకి చొరబడేందుకు యత్నించిన వ్యక్తి కాల్చివేత

Shoot

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి , కేంద్ర మంత్రి ఫారూక్ అబ్దుల్లా నివాసంలోకి ఓ వ్యక్తి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా భద్రతా సిబ్బంది కాల్చి చంపారు. కారులో ఓ వ్యక్తి  ఫారూక్ ఇంట్లోకి చొరబడేందకు యత్నించాడు. ఆ సమయంలో భద్రతా సిబ్బంది సదరు వ్యక్తిని కాల్చిచంపారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఫారూక్ కు జడ్ ప్లస్ సెక్యూరీటి ఉంది. జమ్మూ కశ్మీర్ కు చెందిన మాజీ సిఎంలు ఒమర్ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్, మొహబూబా ముఫ్లీకు జడ్ ప్లస్ భద్రతా ఉంది. ఇది తీవ్రవాదుల పని కాదని ఎస్ పి వివేక్ తెలిపారు.