Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

విధి నిర్వహణలో చురుగ్గా ఉండాలి

Police

ఆదిలాబాద్‌క్రైం: జిల్లా పోలీసులు వి ధులు నిర్వహించడంలో సూర్తి పొందాలని జిల్లా ఎస్‌పి ఎం.శ్రీనివాస్ తెలిపారు. గురువారం స్థానిక పోలీసు క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని 230 మంది పోలీసు హెడ్‌కానిస్టేబుళ్లకు ఒక రోజు సెలవు ప్రకటించామని తెలిపారు. స్థానిక గణేష్ థియేటర్‌లో ప్రదర్షించబడుతున్న ‘హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య’సినిమాను ఉచితంగా కుటుంబ సమే తంగా చూడటానికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. నిజాయితీగా విధులు నిర్వహించాలనే సారంశంపై తీసి న ఈ సినిమాతో జిల్లా పోలీసులు స్ఫూర్తి చెందుతారని భావిస్తున్నట్లు తెలిపారు.

గత 20 రోజుల నుంచి జిల్లా పోలీసులు విధుల్లో ని మగ్నమై ఉన్నారని, సంక్రాంతి పండుగ సందర్భంలో సె లవులపై వెళ్ళకుండా విధులు నిర్వహించారని పేర్కొ న్నారు. జిల్లా పోలీసు కుటుంబాల్లో సంతోషం నింపా లని ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో కానిస్టేబుళ్ళకు సైతం ఇటువంటి అవ కాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమ ంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్‌పెక్టర్ బిప్రవీన్, ఎస్సైలు అ న్వర్‌ఉల్‌హఖ్, జి రామన్న, సిసి యం పోతరాజు, సిబ్బ ంది ఎస్ ప్రేంసింగ్, ఎస్‌కే తాజోద్దిన్, విఠల్, తదితరులు పాల్గొనాన్నారు.
ఇంత వరకు కుటుంబంతో కలిసి

సినిమా చూడ లేదు

గత నాలుగు సంవత్సరాల నుంచి భార్య పిల్లలతో కలిసి సినిమా చూడలేదు. సినిమా చూడాలని ఆశ ఉన్నా అవ కాశంతో పాటు సమయం ఉండకపోవడంతో ఆ అలోచ నే రాలేదు. ఎస్‌పి నిర్ణయం తో మా కుటుంబంతో కలిసి సినిమా చూసే అవకాశం కల్పించడం సంతోషంగా ఉంది.
– భుమన్న ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ ఆదిలాబాద్

సెలవులు దొరకడం కష్టం

పోలీస్ శాఖలో సెలవు దొరకడం కష్టం. ఈ రో జు ఎస్‌పిని ర్ణయంతో సెలవుతో పాటు కుటు ంబ సమేతంగా ఉచితం గా సనిమా చూసే అవ కాశం వచ్చింది. ఈ రో జు పోలీసులకు సంక్రా తి పండుగ వచ్చిందని భావిస్తున్నా.
– ప్రేంసింగ్, ఎస్‌బి హెడ్ కానిస్టేబుల్, ఆదిలాబాద్

మానసిక ప్రోత్సాహం…

జిల్లా ఎస్‌పి శ్రీనివాస్ తీ సుకున్న ఈ నిర్ణయంతో జి ల్లా పోలీసులకు మానసిక ంగా ప్రోత్సాహం లభిస్తుం ది. విధుల్లో చురుకుగా ఉ ండేం దుకు దోహదపడు తుంది. సినిమా చూడడా నికి సెలవుతో పాటు సిని మా చూడడానికి ఉచిత సౌకర్యం కల్పించినం దుకు ఎస్‌పికు కృతజ్ఞతలు తెలు పుతు హర్షం వ్యక్తం చేస్తున్నా.
– ఎస్‌కే తాజోద్దిన్,జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు

పోలీస్ చరిత్రలో లేని అవకాశం

జిల్లా చరిత్రలో ఎన్నడు లేని అవకాశం జిల్లా ఎస్పీ శ్రీనివాస్, పోలీసులకు క ల్పించడంతో పాటు కు టుంబ సభ్యులు సైతం ఆనందోత్సాహంతో ఉన్నారు. జిల్లా పోలీసు లు రాత్రి పగలు విధులు నిర్వహించి విరమం లే కుండా గడుపుతున్న సమ యంలో ఈ నిర్ణయం ఎంతో ఊరట కల్గించింది. ఈ ప్ర క్రీయను కొనసాగించాలని ఎస్‌పిని కోరుతున్నాం. ఆదర్షంగా ఉన్న సినిమాలను చూసి స్పూర్తితో విధుల్లో సైతం చురుకుగా ఉండి శాంతి భద్రతలను పరి రక్షించాలి.
– జి రామన్న, ఎస్‌ఐ ఎస్‌బి ఆదిలాబాద్.

Comments

comments