Home జిల్లాలు సంపూర్ణ పారిశుద్ధ్యంతోనే ఆరోగ్యం

సంపూర్ణ పారిశుద్ధ్యంతోనే ఆరోగ్యం

అవగాహన సదస్సులో కలెక్టర్ టికే శ్రీదేవి
గంట్లవెల్లిలో మొక్కలు నాటిన కలెక్టర్

Untitled-1షాద్‌నగర్‌రూరల్: గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యాన్ని సాధి ంచి తద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుదాం అన్ని కలెక్టర్ టికే శ్రీదేవి అన్నారు. శనివారం ఫరూఖ్‌నగర్ మండల పరిధి లోని మదురాపూర్ గ్రామంలో సంపూర్ణ పారిశుద్యంపై అవ గాహన సదస్సు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజ రయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని వీధుల గుండా ప ర్యటించి పారిశుద్ధ్యం స్థితిగతులను పరిశీలించారు. అనంత రం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గ్రామానికి ప్రభుత్వం తరపున 171 మరుగు దొడ్లు మంజూరు అయినట్లు తెలిపారు. మరుగుదొడ్లను గ్రా మంలో ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారన్న కలెక్టర్ ప్రశ్నకు గ్రా మస్థులు సమాధామనిస్తూ ఆరు వారాల్లో పూర్తి చేసి సంపూర్ణ పారిశుద్ధ్యం సాధిస్తాంమని తెలిపారు. మరుగుదొడ్లను నిర్మిం చడంతో పాటు వాడుకలోకి తేవడం ముఖ్యమని కలెక్టర్ సూ చించారు. బంగారు తెలంగాణ సాధనలో భాగంగా మదురా పూర్ గ్రామాన్ని బంగారు మదురాపూర్ గ్రామంగా తీర్చిదిద్దు కోవాల్సిన బాధ్యత గ్రామస్థులపై ఉందని అన్నారు. మలవి సర్జన ఆరుభయట చేయడం వలన అంటురోగాలు, చిన్న పి ల్లల మేదస్సు శక్తి సామర్ధాలను తగ్గిస్తున్నాయని అందుకో విద్యార్థులు ఎదుగుదలలో రాణించలేక పోవడానికి కారణం కావచ్చని తెలిపారు. జిల్లాలో మరుగుదొడ్లు 43శాతం నిర్మిం చి ఉన్నాయి. కానీ 7 శాతం మాత్రమే వాడుకలో ఉన్నాయని వీటిని వందశాతం నిర్మించి వాడుకలోకి తీసుకురావడం ప్ర తి ఒక్కరి బాధ్యత అని అన్నారు. బహిరంగ మలవిసర్జన రూపుమాపాలంటే అలా చేసిన వారికి జరిమాన విధించడం లాంటి కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.

గ్రామంలో 100 శాతం అక్షరాస్యత సాధించాలని సూచించారు. మూడు నుం డి ఆరు సవంత్సరాల పిల్లలను స్కూలుకు పంపే విధంగా త ల్లిదండ్రులు కృషి చేయాలని అన్నారు. అంగన్‌వాడి కేంద్రా లలో గర్బిణీలకు ఆరోగ్యం, న్యూట్రిషియన్ అందే విధంగా అలాగే జీరో శాతం హోం డెలివరిలకు తగ్గించాలని అన్నారు. ప్రతి గ్రామం ఆధర్శగ్రామంగా తీర్చిదిద్దుకునే విధంగా కృషి చేయాలని అన్నారు. అలాగే పాడి పరిశ్రమపైనే అధిక శాతం జీవిస్తున్న మాగ్రా మంలో వెటర్నరి ఆశుపత్రిని నిర్మించాలని క లెక్టర్‌కు విన్నవించగా ఆమే స్పందిస్తూ మొద టగా సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించండం తర్వాత వెటర్నరి క్యాంపును ప్రస్తుతం ఏర్పా టు చేయిస్తానని, ఉన్నతాధికారులకు విన్న వించి ఏర్పాటు అయ్యే విధంగా కృషి చేస్తాన ని హామి ఇచ్చారు. అదే విధంగా ప్రతి ఇంటికి సోంపీట్ ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం త రపున 3900 రూపాయలు మంజూరు అవు తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నిర్మించు కొని లబ్ధి పొందాలన్నారు. సంపూర్ణ పారిశు ద్ధ్యం సాధించేందులు జిల్లాలోని గ్రామాల ప్ర జలు కృషి చేయాల్సిన అవసరం ఉందని అ న్నారు. అదే విధంగా త్వరితగతిన ఆదర్శగ్రా మాలుగా తీర్చిదిద్దుకొని మిగతా గ్రామాలకు ఆదర్శం కావాలన్నారు.