Home వార్తలు ఎసిడిటీకి యాలకులు

ఎసిడిటీకి యాలకులు

elachaసాధారణంగా యాలకులు వంటల్లో సువాసన కోసం వాడే దినుసుగానే పరిగణిస్తాం. కానీ ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎసిడిటీని తగ్గిస్తుంది.వేడి నీటిలో కానీ, టీలలో చిటికెడు యాలకుల పొడి చల్లుకుని తాగితే ఎసిడిటీ అదుపులోకి వస్తుంది. అజీర్ణం, ఆకలవుతున్నా తినాలనిపించకపోవడం లాంటి సమస్యలను తొలగిస్తుంది. నోటి దుర్వాసన తొలగిస్తుంది.
జీర్ణశక్తిని మెరుగుపరిచి ఎసిడిటీ సమస్యను దూరం చేస్తుంది. తల తిరుగుతున్నప్పుడు యాలకులను నమిలి తింటే ఉపశమనం లభిస్తుంది.