Home ఎడిటోరియల్ ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు

ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు

health-is-wealth“ఆరోగ్యమే మహాభాగ్యం” అన్న పాత మాట కొత్తతరంలో – ప్రస్తుత రోజుల్లో వాస్తవానికి చాలా దూరంగా ఉంది. మారిన జీవనశైలి, ఆహారపు అల వాట్లు, ఉపశమనం లేని పని ఒత్తిడి పలు ఇతర కారకాలు ప్రపంచ మానవాళిని మునుపెన్నడు కనివినీ ఎరుగని వ్యాధుల వలయంలోకి నెట్టివేస్తున్నాయి. దీనికి ఉదాహరణలు వయస్సులో ఉన్న పిల్లలు, యువకులు షుగర్ వ్యాధి పాలవటం, ఒత్తిడి వలన పెద్దలే కాక, వారికి పుట్టే పిల్లలు కూడ జన్యుసంబంధిత వ్యాధులు పుచ్చుకోవటం, ఎదిగే వయస్సులో రక్తహీన తతో పిల్లలు బాధపడటం, కాలుష్యం కక్కుతున్న విషంతో పలు రకాల కాన్సర్‌ల బారిన పడటం, ఇలా పలు ఆరోగ్యసమస్యలు తన మన భేదం లేకుండా ధనిక-మధ్యమ-బీద దేశాలని పట్టిపీడిస్తున్నాయి. అయితే ధనిక-అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజారోగ్యా నికి పెద్దపీట వేయటం వలన వ్యాధులు కొద్దిగా నియంత్రణ గావించబడినా పేద-మధ్యమ దేశాలు మాత్రం ఇరకాటంలో పడ్డాయని వస్తున్న నివేదికలు వాస్తవం. 2016వ సం॥లో ప్రపంచ ఆరోగ్య దినం (ఏప్రిల్ 7) ని ప్ర.ఆ.స. షుగర్ వ్యాధి మీద అవగాహన తీసుకురావాలని, ముఖ్యంగా పేద-మధ్యమ దేశాల్లో షుగర్ వ్యాధిపై ప్రజాచైతన్యం తీసుకురావాలని పిలుపు నిచ్చింది. దీనికి గల ముఖ్యకారణం పెరుగుతున్న షుగర్ వ్యాధి గ్రస్తుల మరణాలు. ఏట 15లక్షల మంది షుగర్ వ్యాధి వలన వచ్చే సమస్యలతో మరణిస్తు న్నారంటే ఇది ఎంతటి ఉపద్రవమో అర్ధమవుతుంది.
షుగర్ వ్యాధి కోరల్లో మన దేశం, రాష్ట్రం
2015 ఆఖరికల్లా 7కోట్లమంది ప్రజలు షుగర్ వ్యాధితో భారతదేశంలో బాధపడ్డారు. వీరిలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల వారే ఉన్నారన్న నివేదిక కేవలం పట్టణీకరణ, పెరిగిన వసతులు, తగ్గిన శారీరక శ్రమ, పట్టణ ప్రాంతాల వారినే షుగర్ వ్యాధి వరిస్తుం దన్న నమ్మకాన్ని కొట్టిపారేస్తున్న నిజం. తింటున్న ఆహార పదార్థాలలో నాణ్యతలోపం ముఖ్య కారణం గా మనదేశంలో కనపడుతుంది. దీనిఫలితంగా షుగర్ వ్యాధి పిల్లల్లో (2-14 సం॥లోపే) వచ్చి సుమారు 10-14 వేలమంది పిల్లలు ప్రతి సం॥ భారత దేశంలో మృత్యువాతన పడుతున్నారని, వీరిలో ఎక్కువగా ఆర్థి కంగా బలహీనంగా ఉన్నవారే బాధితులు వున్నా రన్న నివేదికలు ప్రత్యేకంగా గమనించాల్సి ఉంది. వీరిలో చాలామందికి మందుల ఖర్చు భరించే స్థితి కూడా లేదని తెలు స్తుంది. ఇటువంటి పేద పిల్లల షుగర్ వ్యాధి కష్టాలని తీర్చాలని తమిళనాడు ప్రభు త్వం ఇన్సులిన్ ఇంజెక్షన్‌లని ఉచి తంగా పంపిణీ చేస్తుంది. ఇంతటి బృహ త్‌కార్యం ఇతర రాష్ట్రాలు కూడా అవ లంబించి పేదపిల్లలను ఆదుకుంటే మంచిది.
దేశమంతటా పరిస్థితి ఒకలాగ ఉంటే రైతురాజ్యం అని చెప్పుకొని శారీరక శ్రమ ఎక్కువగా చేసే తెలుగు రాష్ట్రాల్లో కూడ షుగర్, బిపి పలు ఇతర వ్యాధులు ఎక్కువవుతున్నా యని “నేషనల్ ఫామిలీ హెల్త్ సర్వే” తాజాగా తమ నివేదికలో పేర్కొంది. ఇటీవల విడుదలైన ఈ రిపోర్టులో తెలంగాణ రాష్ట్రంలో 20% మంది రక్తపోటుతో, 6.3%మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారని తేలింది. 6.8% తో స్త్రీలలో షుగర్‌వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. (6% పురుషులతో పోలిస్తే)ఈ నివేదిక ద్వారా రాష్ట్రంలో రక్తహీనతతో బాధపడే పిల్లలు పట్టణప్రాంతంలో 52% మరియు గ్రామీణ ప్రాంతంలో 67.5% అని తెలుస్తుంది. ఇంత ఎక్కువ శాతం లో రక్తహీనతకి గల కారణాలు తెలుసు కొని పిల్లల సంక్షేమానికి పెద్దపీట వేస్తే తద్వారా రోగరహిత యువశక్తిని రాష్ట్రంలో పెంపొందించుకునే అవకాశం ఉంది. ఇక పురుషులలో ముఖ్యంగా లైంగిక సంబంధిత వ్యాధులపై అవగాహన పెరిగినట్లు తెలుస్తుంది. హెచ్‌ఐవి, ఎయిడ్స్ తదితర వ్యాధులపై పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 55%, 45% మంది ప్రజలకు అవగాహన ఉండటం శుభసూచకం. ఈ అవగాహన, చైతన్యం, ప్రాంణాంతక వ్యాధినుండి ప్రజలు తమని తాము కాపాడుకుంటున్న వైనం స్పష్టంగా కనపడుతున్నది. రాష్ట్రలో వైద్య విధానాలను భారీగా ప్రక్షాళన చేస్తూ కెసిఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు హర్షణీయం. ప్రభుత్వ ఆస్పత్రుల నిర్మాణం, కార్పొరేట్ సంస్థలకి దీటుగా ట్రీట్‌మెంట్ పద్ధతులు ప్రజారోగ్యానికి పెద్దపీట వేసే దిశగా కదులు తున్నాయనటం – ప్రజానీకానికి సంపూర్ణ ఆరోగ్యం అందించి, వ్యాధులపై నిరంతర చైతన్యం కలిగించే కార్యక్రమాలను రూపొందిస్తే ఆరోగ్యంతో విరాజిల్లే తెలంగాణని చూడవచ్చు.
బాధ్యతతోనే బాధ దూరం
ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ మరియు ప్ర.ఆ.స. గణాంకాలు చూస్తుంటే 2040 సం॥కల్లా 20-79 సం॥ల మధ్యవయస్కులు సుమారు 10% (ప్రపంచ జనాభాలో) షుగర్ వ్యాధి బారిన పడతారని తెలుస్తుంది. వ్యాధికి ముఖ్య కారకాలుగా జీవనశైలి, అధిక ఒత్తిడి, జన్యుపరంగా కుటుంబాల్లో వ్యాధి నడ వటం ఉన్నాయి. 2040 సం॥వరకు మనదేశం షుగర్ వ్యాధితో రెండవస్థానంలో చైనా తర్వాత ఉండబోతుం దన్న భయంకర నిజం చేదుగా ఉన్నా జీర్ణించుకుని వ్యాధి నివారణ చర్యల దిశగా అడుగువేయాల్సిన బాధ్యత – ప్రజలు-ప్రభుత్వాలపై ఉంది. షుగర్ వ్యాధి వలన సదరు రోగులపై ఆర్థికభారం కూడా ఎక్కువే. వ్యాధి వలన సదరు రోగులపై ఆర్థికభారం కూడా ఎక్కువే, వ్యాధి వలన వచ్చే సమస్యలతో శరీరంలో ఏ భాగాన్నైనా (కంటి నుండి కాలువరకు) కోల్పోయే ప్రమాదం ఉంది. షుగర్ వ్యాధి వలన కలిగే శక్తిహీనతతో దేశ ఆర్థిక వ్యవస్థలే కుంటుపడే పరిస్థితి దాపురిస్తుందన్న నివేదికలు చాపక్రింద నీరులా ప్రాకు తున్న వ్యాధి కల్గించే నష్టాలను తేటతెల్లం చేస్తున్నాయి. వ్యాధి రాకుండా ఆరోగ్య సూత్రాలు పాటించటం ప్రతి ఒక్కరి బాధ్యత. ఒకవేళ వివిధ కారణాల వలన వ్యాధి వచ్చినా దానిని నియంత్రణలో పెట్టుకొని ప్రాణాలు కాపాడుకునే దిశగా స్వయం చైతన్యంతో వ్యాధిగ్రస్తులు మెలిగితే ప్రాణాంతక పరిస్థితులను అధిగమించే అవకాశాలు ఎక్కువే.