Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

గిరిపుత్రులకు కార్పొరేట్ వైద్యం

Laxma-reddy

పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేస్తాం
భద్రాచలం: మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో నివశిస్తున్న గిరిపుత్రుల ఆరోగ్య పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధితో పనిచేస్తోందని, అందుకనే భద్రాచలం ఏరియా ఆస్పత్రి ప్రాంగణంలో మరో 100 పడకల ఆస్పత్రిని కార్పోరేట్ స్థాయి నిర్మించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖామాత్యులు డా. లకా్ష్మరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఏరియా ఆస్పత్రి ప్రాంగణంలో రూ.19 కోట్లతో నిర్మించిన 100 పడకల అధునాత ఆస్పత్రిని రోడ్లు, భవనాలు, స్త్రీ, శిశుసంక్షేమ శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ గిరిజనులు అధికంగా నివశించే ప్రాంతం అయినందు వల్ల వ్యాధులు సోకిన సమయాల్లో వారి ప్రాణాల మీదికి వస్తోందని, వారికి మెరుగైన వైద్యసేవలు అందక సతమతం అవుతున్నారని అన్నారు. అలాంటి వారి ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధునాతన హంగులతో ఇక్కడ మరో ఆస్పత్రిని ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 ఐసియి కేంద్రాలు, 40 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వైద్యాధికారులు ప్రజలకు నాణ్యతతో కూడిన వైద్య సేవలు అందించాలని సూచించారు. రోగాలతో వచ్చి స్వస్థత పొందిన వారు వైద్యం చేసిన డాక్టర్లను చిరకాలం గుర్తుంచుకుంటారని చెప్పారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ దట్టమైన అడవులకు కేంద్రమైన భద్రాచలం ప్రాంతంలోని ఈ ఆస్పత్రికి నాలుగు రాష్ట్రాలతో ముడిపడి ఉందని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఛత్తీస్‌గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేష్ రాష్ట్రాలకు చెందిన ప్రజలు వస్తుంటారని, వా రిని కాదనకుండా వైద్య సేవలు అందించాలని చెప్పారు. గ తంలో ఉన్న 100 పడకల ఆస్పత్రిలో ప్రజలు చక్కటి సేవలు అందుతున్నాయనే రికార్డు ఉందని, ఇప్పుడు అదనంగా మరో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటైనందున వైద్యాధికారు లపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. అనంతరం ఆస్ప త్రిలో నిర్మించిన గదులను కలియతిరిగారు. అంతకు ముం దు ఐటిడిఏ కార్యాలయంలో నిర్వహించిన సమన్వయ సమా వేశం అనంతరం ఐటిడిఏ కార్యాలయం ప్రాంగణంలో హరి త హారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టిఎస్‌ఎం ఎస్‌ఐడిసి చైర్మన్ కృష్ణారావు, వైద్య శాఖ అడిషనల్ డైరెక్టర్ ప్రభావతి, జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డా.దయానంద స్వామి, భద్రాచలం ఆర్డిఓ శివ నారాయణరెడ్డి, ఆసుపత్రుల సమన్వయ అధికారి డా.జనార్ధన్, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments