Home ఆఫ్ బీట్ ఎక్కువ తింటే… ప్రమాదమే..!

ఎక్కువ తింటే… ప్రమాదమే..!

Pan

భోజనం తర్వాత తమలపాకులు వేసుకోవడం చాలామందికి అలవాటు. దీన్ని మితంగా తీసుకున్నంత వరకు ఫరవాలేదు. ఎలాంటి సమస్యలు ఉండవు. రోజుకు పది లేదా అంతకంటే ఎక్కువ తీసుకుంటే మాత్రం చిక్కులు తప్పవని అంటున్నారు పరిశోధకులు. అలాంటివారికి ఆరోగ్య సమస్యలు తప్పక రావచ్చునని అంటున్నారు. తమలపాకును తొడిమతో సహా తీసుకునే వారిలో సంతానోత్పత్తి తగ్గే అవకావాలు ఎక్కువగా ఉంటాయనే విషయం ఇటీవల పరిశోధనల్లో తేలింది. దీన్ని పొగాకులో కలిపి తీసుకుంటే నోటి కేన్సర్ వచ్చే అవకాశం 80 శాతం వరకు ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకి ఐదారుసార్లు తమలపాకు వేసుకునేవారికి అది భయంకరమైన అలవాటుగా మారుతుందని, ఆ తర్వాత దీన్ని మానుకోవాలన్నా మానుకోలేరని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే తమలపాకుల్ని ఒకటి లేదా రెండు సార్లకు మించి తీసుకోవద్దని చెబుతున్నారు.