Home ఆఫ్ బీట్ హెల్త్ కార్నర్ : ఆరోగ్యకరమైన జీవనశైలి చిట్కాలు

హెల్త్ కార్నర్ : ఆరోగ్యకరమైన జీవనశైలి చిట్కాలు

 Health Topics

ఆలూ : పచ్చి బంగాళ దుంప రసంలో ఔషధ విలువలు మెండుగా ఉంటాయి. రోజూ ఏదో ఒక సమయంలో గ్లాసు రసం తాగితే .. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవు. అలాగే మూత్రాశయంలో చిన్న చిన్న రాళ్లుంటే వాటిని కరిగించేస్తుంది.

జీలకర్ర : పావు టీ స్పూన్ జీలకర్ర పొడిలో చిటికెడు ఇంగువ, కాస్త ఉప్పు గోరువెచ్చని నీళ్లలో కలుపుకొని తాగాలి. ఇలా చేయడం వల్ల కడుపునొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందొచ్చు.

ఖర్జూరం: జ్వరంతో బాగా నీరసంగా ఉన్నప్పుడు..రాత్రి పడుకునే ముందు 4,-5 ఖర్జూరాలను నీళ్ల లో నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని గ్రైండ్ చేసుకొని తాగితే తక్షణ శక్తి వస్తుంది. ఈ టానిక్ పిల్లలకు త్వరగా ఫలితాన్ని చూపుతుంది.

ఆలివ్ ఆయిల్ : చిన్న పిల్లలకు డైపర్సు వాడటం వల్ల, తరచు ర్యాషస్ అవుతుంటాయి. అవి పిల్లలకు చాలా ఇబ్బంది కలిగిస్తాయి. అలాంటప్పుడు ఆ ర్యాషస్‌పై రోజుకు 5-,6 సార్లు ఆలివ్ ఆయిల్ రాస్తే కాస్త ఉపశమనం కలుగుతుంది.

అరటిపండు: బాగా పండిన అరటిపండును గుజ్జుగా చేసుకొని, అందులో టీ స్పూన్ తేనెను కలపాలి. దాన్ని రోజుకు మూడుసార్లు తీసుకుంటే మౌత్ అల్సర్స్ తగ్గుతాయి. ఈ మిశ్రమాన్ని అల్సర్‌పై రాసినా మంచి ఫలితం ఉంటుంది.

 Health Topics

telangana latest news