Search
Friday 21 September 2018
  • :
  • :

ఆరోగ్యానికే పెద్దపీట

ఈ రోజుల్లో ప్రజలకు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ, అవగాహన పెరిగాయి. ఇంటర్‌నెట్ అందరికీ అందుబాటులో ఉండటంతో ముందుగానే సీజనల్ వ్యాధుల గురించి తెలుసుకుని జాగ్రత్త పడుతున్నారు.  నెట్‌తోపాటు ఎప్పటికప్పుడు ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు  హెల్త్‌కేర్ సర్వీస్ ప్రొవైడ్ సెంటర్లు కృషిచేస్తున్నాయి.  ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు చికిత్సను అందజేస్తున్నాయి. అపార అవకాశాలను కలిస్తోన్న హెల్త్‌కేర్ సర్వీస్ ప్రొవైడర్స్ గురించి తెలుసుకుందాం… 

Medical-Jobs

మారుతున్న కాలంతో పాటు కొత్త కొత్త జబ్బులు, రకరకాల రోగాలు కూడా వస్తున్నాయి. ఇప్పటి వారిలో ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన ఎక్కువనే చెప్పవచ్చు. దాదాపు అందరికీ అందుబాటులో ఉన్న టెక్నాలజీ ఇందుకు సహకరిస్తోంది. అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పించడానికి డిజిటల్ ఇండియా ద్వారా ప్రభుత్వం ఆరోగ్య కార్యక్రమాల్లో భాగంగా ముందుకు వచ్చిన వారే హెల్త్‌కేర్ ప్రొవైడర్స్. వీరు సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, అవసరమైన చికిత్సను అందజేస్తారు. అన్ని రంగాలతోపాటు హెల్త్‌కేర్ ఇండస్ట్రీలోనూ డిజిటలైజేషన్ పెరిగింది. దీంతో అనేక అవకాశాలు వస్తున్నాయి. భారత దేశంలో హెల్త్‌కేర్ ఇండస్ట్రీ రోజురోజుకీ విస్తరిస్తోంది. ఆరోగ్యం కోసం ఎంత ఖర్చయినా పెట్టడానికి ప్రజలు వెనుకాడటం లేదు. ఇందుకు కారణం ఆర్థిక పరిస్థితి అంతకు ముందు కన్నా మెరుగ్గా ఉండటమే. అంతేకాకుండా విద్యావంతుల సంఖ్య పెరగడం కూడా ఓ కారణం. దీని వల్ల హెల్త్ కేర్ సెంటర్ల ప్రాధాన్యం పెరిగింది.
ఉపాధి అవకాశాలు : మెడికల్ విషయాలకు సంబంధించిన పుస్తకాలు, పరికరాలు, వైద్యరంగంలోనూ ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యం పెరిగింది. మెడికల్ టూరిజం వల్ల హెల్త్‌కేర్ సెంటర్ల అవసరం కూడా పెరిగింది. అందువల్ల ఈ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువయ్యాయి. విద్యార్థులతోపాటు ప్రొఫెషనల్స్ కూడా ఐటి, మెడిసిన్ రంగంపై ఆసక్తి చూపుతున్నారు. హెల్త్ సైన్స్‌లో అవకాశాలు అధికంగా ఉండటంతో వీటివైపు మొగ్గుచూపుతున్నారు. హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ ప్రస్తుత కాలంలో ఆన్‌లైన్ ద్వారా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. రికార్డ్‌ని డిజిటలైజ్ చేయడం వంటివి చేస్తున్నాయి.
శిక్షణ అవసరం : హెల్త్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలో ఉద్యోగం సాధించాలంటే కంప్యూటర్ సైన్స్‌లో శిక్షణ అవసరం. బిజినెస్ మేనేజ్‌మెంట్, ఆసుపత్రులతో సంబంధాలు, ప్రజల ఆరోగ్య విషయాలపై అవగాహన ముఖ్యం. అందుకోసం ఎందులోనైనా బ్యాచిలర్ డిగ్రీ, లేదా మాస్టర్స్ డిగ్రీ , మెడికల్ లేదా కంప్యూటర్ డిగ్రీ చేసినవారై ఉండాలి. ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ (IIHMR), ఢిల్లీ ఇందుకు సంబంధించిన కోర్సులను అందిస్తోంది.

స్కిల్స్ ఉండాలి : కంప్యూటర్ అప్లికేషన్, ప్రాసెన్‌ను అవగాహన చేసుకోవడం, సమస్యను పరిష్కరించడం, మార్కెట్ పరిశీలన, వాక్చాతుర్యం, టీం వర్కును పోత్సహించడం, లీడర్‌షిప్ లాంటి స్కిల్స్ ఈ రంగంలో రాణించడానికి ఉపయోగపడతాయి. ఈ రంగంలో హెల్త్‌కేర్ ఐటి ఎగ్జిక్యూటివ్, హెల్త్ ఇన్‌ఫర్మాటిక్స్ టెక్నీషియన్, చీఫ్ మెడికల్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్లు, హెల్త్‌కేర్ బిజినెస్ అనలిస్ట్, ప్రాజెక్టు మేనేజర్, డెవలపర్, ట్రెయినర్‌లుగా స్థిరపడవచ్చు.
అధిక వేతనాలు : ఈరంగంలో స్థిరపడినవారికి వేతనాలు కూడా బాగుంటాయి. సంవత్సరానికి 3 నుంచి 8 లక్షల వరకు ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించిన అదనపు విజ్ఞానం, సమస్యలపై వెంటనే స్పందించడం, హెల్త్‌కేర్ యూనిట్‌కు దగ్గరగా ఉండటం, టెక్నాలజీ పరంగా అదనపు అవగాహన ఇవన్నీ వున్నవారికి ఈ రంగంలో వేగంగా ఎదగడానికి అవకాశం ఉంది.

Comments

comments