Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

చిన్నారులలో పౌష్ఠికాహార లోపాలు – భీతిగొలిపే వాస్తవాలు

angusఆర్ధికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతి గ్రహీత, అమెరికాలోని ప్రిన్స్ టన్ యూనివర్సిటీలో పాఠాలు చెబుతున్న బ్రిటీష్ ఆర్ధిక శాస్త్రవేత్త ఆంగస్ డీటన్ భారతదేశంలోని చిన్నారుల పౌష్టికాహార లోపాలపై చేసిన పరిశోధనకు స్వెర్జెస్ రిక్స్ బ్యాంకు ప్రైజ్ కూడా ప్రకటించింది. ఈ పరిశోధనలో విస్తు గొలిపే వాస్తవాలను ఆంగస్ డీటన్ వెల్లడిం చారు. మేడిపండు చందంగా ఉన్న భారత ఆర్ధిక వ్యవస్థలో వున్న లోపాలను, వాటి కారణంగా చిన్నారుల పోషకాహార లోపాలను తన పరిశోధనలో ఎత్తిచూపారు. చిన్నారులలో పౌష్ఠికాహార లోపం కారణంగా శారీరకంగానూ-మానసికంగానూ ఎదుగుదలలో తీవ్ర ప్రతికూల ప్రభావాలు ఎదుర్కొం టున్నారని, ఈ లోపాలను అధిగమించేందుకు ప్రభుత్వాలు తీసుకొనే చర్యలు కూడా నామమాత్ర మేనని తెలిపారు. ఈ పరిశోధనలో మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ చెప్పిన మాటలతో ఏకీభవిస్తూ పౌష్ఠికాహార లోపం అంటే పప్పుధాన్యాలు, ఆకుకూరలు, గుడ్లు, పండ్లు రోజూవారి ఆహారంలో లేకపోవడమని తెలిపారు. పౌష్ఠికాహార లోపాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల 50 లక్షల మంది చిన్నారులలో శారీరక, మానసిక ఎదుగుదల లోపించిందని, అందులో సగం మంది భారతదేశం లోని చిన్నారులు ఉన్నారని ద్రిగ్భాంతి గొలిపే విషయాలను వెల్లడించారు. 2020 నాటికి అదనం గా రెండు కోట్ల భారతీయ చిన్నారులు పౌష్ఠికా హారలోపం కారణంగా చేరుతారని వరల్ హెల్త్ అసెంబ్లీ తెలిపింది. మెక్సికోలో జరిగిన సదస్సులో 2015 నివేదిక ప్రకారం భారతదేశంలోని ప్రతీ ముగ్గురు చిన్నారులలో ఒకరు పౌష్ఠికాహార లోపంతో బాధలను అనుభవిస్తున్నారని తెలిపింది. పౌష్ఠికా హారలోపం కారణంగా శారీరక, మానసిక సమస్యల తో పాటు చిన్నారులలో రోగనిరోధక శక్తి కూడా గణనీయంగా తగ్గుతుందని, దీని కారణంగా రకరకాల వ్యాధుల భారిన పడి మరణాలకు చేరువవు తున్నారు. పౌష్ఠికాహార విషయంలో ప్రపంచదేశాల లో భారతదేశం అట్టడుగు స్థానంలో ఉండడం ఆందోళన కలిగించే విషయం. నిర్లక్షం కారణంగా బాలికలు మరింతగా పౌష్ఠికాహార లోపంతో ఉన్నారు. ప్రజాస్వామ్య భారతదేశంలో ఆర్ధిక అసమానతలు ఎక్కువగా ఉన్నాయని, ఈ అసమాన తల కారణంగానే చిన్నారులు సైతం పౌష్ఠికాహార లోపంతో బాధపడుతున్నారని ఆంగస్ డీటన్ తన పరిశోధనలో వెల్లడించారు.
వాస్తవానికి దగ్గరగా ఉన్న ఈ పరిశోధన ప్రకారం భారత రాజకీయ నాయకులు కేవలం పెట్టుబడిదారులకు, సంపన్నవర్గాలకు మాత్రమే ఆర్ధికంగా వెసులుబాటులు కల్పిస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజానీకానికి చేరవలసిన ఆర్థిక ఫలాలు చేరటం లేదు. పేదల, సంపన్నుల మధ్య ఆగాధం మరింతగా పెరిగి ఆర్థిక అసమానతలు చోటుచేసుకుంటున్నాయి. నిజానికి భారతదేశం సంపన్నుల భారతదేశంగా ఒకవైపు, ఆకలి, అనా రోగ్యం పాలవుతున్న పేద, మధ్యతరగతి, నిస్తేజమైన వ్యవసాయ కార్మిక, కర్షక, ఉపాధికొరవైన యువత, దోపిడికి గురవుతున్న భారతదేశంగా మరోవైపు చెప్పుకోవచ్చు. రోజురోజుకు పెరుగుతున్న ధరలు, చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్న భారతదేశ అత్యధిక ప్రజానీకం కష్టిస్తూ ఉంటే తద్వారా వచ్చిన ఆర్థిక ఫలాలను సంపన్నవర్గాలు తన్నుకుపోతు న్నాయి. ఇటువంటి అసమానతలను సరిచేయవల సిన ప్రభుత్వాలు, సంపన్నుల చేతిలో పగ్గాలుగా ఉంటుండంతో ఆర్థిక వ్యత్యాసాలు మరింతగా పెరుగుతున్నాయి. రోజురోజుకు నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో నిత్యావసర వస్తువులైన బియ్యం, పప్పుధాన్యాలు వంటి ఆహార సంబంధిత వస్తువులు పేద, మధ్యతరగతి ప్రజానీకా నికి దూరం అవుతున్నాయి. ఇవి కేవలం సంపన్ను లకు మాత్రమే లభ్యమైయే ఆహారంగా మారిపోయిం దనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పౌష్ఠికాహారలోప ప్రభావం గర్భిణీలు, పేద, మధ్య తరగతి ప్రజానికంపై ఎక్కువగా ఉంది. అభం, శుభం తెలియని చిన్నారులకు సైతం పౌష్ఠికాహారా లను అందించ లేకపోతుండడంతో చిన్నారులు శారీరక, మానసిక ఎదుగుదలకు దూరమవుతూ, మరణాల బారిన పడుతున్నారు. భారతదేశంలోని ప్రజానికం కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, విభిన్న సంస్కృతుల సమ్మిళితమై ఉండటంతో కొన్ని స్వార్ధపూరిత రాజకీయ పార్టీలు, నాయకులు విభజించు పాలించు ప్రాతిపదికన ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతూ ఆర్థిక అసమానతలు, దోపిడి వంటి ప్రజా సంబంధిత అంశాలు ప్రజా నీకంలో ప్రధాన చర్చకు రాకుండా ప్రక్కదారి పట్టిస్తు న్నారు. ఇటువంటి ఆర్థిక సమాజంలో భారతీయ చిన్నారులు కూడా సమిధలవుతుండడం ఆందోళన కలిగించాల్సిన విషయం. ఈ విషయాలపై పలు సామాజిక సంస్థలు, ప్రజాసంఘాలు, మేధావులు రాజకీయాలకు అతీతంగా ఆర్థిక సమానత్వం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి.

Comments

comments