Search
Thursday 15 November 2018
  • :
  • :

ఆరోగ్యానికి ఆహారం

Seed

మనం తీసుకునే ఆహారం కేవలం కడుపు నింపడానికే కాకుండా, ఆరోగ్యాన్నిచ్చేదిగా ఉండాలి. ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకునేవారికి జబ్బులు కూడా దూరంగా ఉంటాయి. తినక ఎలా తప్పదు మరి ఆ తినేదేదో ఆరోగ్యకరమైనదైతే అటు ఆకలీ తీరుతుంది, ఇటు ఆరోగ్యమూ బాగుంటుంది కదా. ఫర్మెంటెడ్( కిణ్వన ప్రక్రియ), మెలకెత్తిన ఆహారాలు వీటి కిందకు వస్తాయి.

ఈ రకమైన ఆహారంలో అందే అధిక పోషకాలు గూర్చిన వివరాలు…

ఫర్మెంటేషన్ వల్ల లాభాలు బ్యాక్టీరియా అనగానే అదేదో చెడు చేస్తుందనే భావన ఉంటుంది కాని అన్ని రకాల బ్యాక్టీరియాలు చెడుచేసేవి కావు.

ఫర్మెంటేషన్ వల్ల ఏర్పడే బ్యాక్టీరియా జీర్ణక్రియను సమతులం చేసి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ సమయంలో ఏర్పడే బ్యాక్టీరియా ప్రొబయెటిక్స్ గా పనిచేస్తాయి, వీటిల్లో శరీర ఎదుగుదలకు ఉపయోగపడే విటమిన్లు, లవణాలు వంటివి వచ్చి చేరతాయి.

మొలకెత్తిన ఆహారం గింజలు, నట్స్ గా ఉన్నప్పటికంటే మొలకెత్తిన తరువాత వీటిని శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. వీటిల్లో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, కాపర్, జింక్ వంటి లోహాలను మొలకెత్తిన ఆహారం నుంచి శరీరం త్వరగా శోషించుకుంటుంది. మొలకెత్తిన ఆహారంలో కూడా పచ్చి వాటిల్లో ఎక్కువ పోషకాలు ఉండగా ఉడికించిన వాటిలో వాటి శాతం తగ్గుతుంది.

Comments

comments