Home నాగర్ కర్నూల్ ఆరోగ్యంగా ఉన్నపుడే మానసిక ప్రశాంతత

ఆరోగ్యంగా ఉన్నపుడే మానసిక ప్రశాంతత

Healthy peace of mind

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్‌ప్రథినిధి : మనిషి ఆరోగ్యంగా ఉన్నపుడే మానసిక ప్రశాంతత చేకూరుతుందని జిల్లా కలెక్టర్ శ్రీదర్ అన్నారు. బుధవారం ఒలంపిక్ డేను పురస్కరించుకుని గాంధీ పార్క్ నుంచి జెడ్‌పీ మైదానం వరకు నిర్వహించిన 2కే రన్‌ను జిల్లా కలెక్టర్ శ్రీదర్, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ చీఫ్ ఫ్యాట్రన్ జక్కా రఘునందన్‌రెడ్డిలు ప్రాంభించారు. ఈ సందర్భంగా జెడ్‌పీ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు, క్రీడలు, వ్యాయామం పట్ల శ్రద్ద చూపాలన్నారు. పరీక్షల సమయంలో కనీసం అరగంట పాటు వ్యాయా మం చేస్తే మానసికంగా ఆరోగ్యంగా ఉంటారన్నారు. అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ జక్కా రఘునందన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్తులు తమ కు ఇష్టమైన ఏదో ఒక క్రీడను ప్రతిరోజు ఆడడం వల్ల ఆరోగ్యంగా ఉంటారన్నారు. 2కేరన్‌లో పాల్గొన్న యువకులు, విద్యార్థులు, విద్యార్థులను అభినందించారు. ఈకార్యక్రమంలో జిల్లా అసోసియేషన్ బాధ్యులు, ఆర్‌డీఓ శ్రీనువాసులు, టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు, ప్రజా పస్రథినిధులు, క్రీడాకారులు, వివిద పాఠశాలల పీఈటీలు, గురుకుల పాఠశాలల విద్యార్తులు పాల్గొన్నారు.