Home మన ఆరోగ్యం ఆకుకూరలతో ఆరోగ్యం పదిలం

ఆకుకూరలతో ఆరోగ్యం పదిలం

Healthy with Green leafy vegetables

ఆకుకూరలు క్రమం తప్పకుండా తీసుకోవాలి.
ఎటువంటి రకమైన ఆకుకూరలైనా సరే ఆరోగ్యాన్ని కాపాడతాయి. శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలను అందిస్తాయి. వారంలో వీలైనంత ఎక్కువగా వీటిని తీసుకోవాలి. పాలకూర, బచ్చలి, పుదీనా, కొత్తిమీర వంటివాటిని కూరల రూపంలో కాకుండా స్మూథీ లేదా సలాడ్‌గా తీసుకుంటే , వాటిలోని పోషకాలన్నీ నేరుగా శరీరానికి అందుతాయి. శరీరానికి కావాల్సిన శక్తి తక్షణం లభిస్తుంది. ఆకుకూరల్లో అత్యధిక మొత్తంలో పీచు ఉంటుంది. ఇది జీర్ణక్రియ సాపీగా జరగడంలో సాయపడుతుంది. ఆకుకూరల్లో ఫైటోన్యూట్రియంట్లు ఎక్కువ ఉండటం వల్ల ఇవి రోగనిరోధక శక్తిని పెంచి చిన్నచిన్న అనారోగ్యాలను దూరం చేస్తాయి. ముదురు ఆకుపచ్చ ఆకుకూరల్లో క్యాల్షియం, విటమిన్- కె సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలు, కణజాలాల ఆరోగ్యానికి సహకరిస్తాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఎ, సి విటమిన్లు కూడా ఎక్కువే. పైగా కెలొరీలు కూడా తక్కువే. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె జబ్బులకు చెక్ పెట్టొచ్చు. అంతేకాదు వీటిద్వారా అందే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతిమంతంగా ఉంచుతాయి. ఆకుకూరలను తీసుకోవడం వల్ల రక్తకణాల త్వరగా పునర్‌నిర్మితమవుతాయి. దాంతో శరీరానికి కావాల్సిన శక్తి అందుతుందనడంలో సందేహం లేదు.