Home తాజా వార్తలు దర్శకుడు మణిరత్నంకు గుండెపోటు

దర్శకుడు మణిరత్నంకు గుండెపోటు

Mani Ratnamచెన్నయ్ : ప్రముఖ దర్శకుడు మణిరత్నానికి సోమవారం గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన్ను చెన్నయ్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆయను గుండెపోటు రావడం ఇది నాల్గోసారి. మణిరత్నం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 2004లో యువ సినిమా షూటింగ్ సందర్భంగా తొలిసారి ఆయనకు గుండెపోటు వచ్చింది. సెట్ లోనే గుండెపోటు రావడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం 2015లో ’ఓకే బంగారం‘ షూటింగ్ సందర్భంగా ఆయన గుండెపోటుకు గుయ్యారు. ఈ క్రమంలో 2018లో కూడా ఆయనకు గుండపోటు వచ్చింది. ప్రస్తుతం మణిరత్నం ’పొన్నియన్ సెల్వన్‘ అనే హిస్టారికల్ సినిమాను తెరకెక్కుస్తున్నారు. మణిరత్నం త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు ఆకాంక్షించారు.

మణిరత్నం అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన వ్యక్తిగత ప్రతినిధి నిక్కిల్ సూచించారు. రెగ్యులర్ చెకప్ కోసమే మణిరత్నం ఆస్పత్రిలో చేరానని, చెకప్ పూర్తవగానే ఆయన తిరిగి తన పనిలో చేరిపోయారని నిక్కిల్ తెలిపారు. దీంతో మణిరత్నం అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.

Heart Attack To Director Mani Ratnam