Search
Wednesday 26 September 2018
  • :
  • :

డ్రోన్ల సహాయంతో గుండెమార్పిడి ఆపరేషన్లు..!

Drones-Medicalముంబయి: గుండెమార్పిడి ఆపరేషన్లకు డ్రోన్లను వియోగించేందుకు ములుంద్‌లోని ఫార్టిస్ ఆసుపత్రి ప్రయత్నాలు చేస్తోంది. డ్రోన్లను ఏర్పాటు చేసుకోవడానికి ముంబయి ఐఐటి సహకారం తీసుకోనుంది. వీటి వినియోగంతో సమయం, ఖర్చు ఆదాచేయవచ్చని భావిస్తున్నారు. ములుంద్‌లోని ఫోర్టిస్ ఆసుపత్రిలో జరిగిన సమావేశంలో గుండెమార్పిడి విభాగం అధిపతి డాక్టర్ అన్వయ్ మూల్యా మాట్లాడుతూ గుండెను అత్యంత వేగంగా ఒక చోట నుంచి మరో చోటుకు తరలించేందుకు ఆ టెక్నాలజీని వినియోగిస్తామని పేర్కొన్నారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు తప్పుతాయన్నారు. సాధారణంగా ఎక్కువ సమయం తీసుకుం గుండె ఆపరేషన్‌కు పనికిరాకుండా పోయే ప్రమాదముంది.. దీంతో కాలంతో పోటీపడేందుకు డ్రోన్లను ఆశ్రయిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఇది ప్రతిపాదన స్థాయిలో ఉందని.. దీనికి పోలీసులు, ఎయిర్‌పోర్టు అథారిటీ తదితర అనుమతులు రావాల్సి ఉందన్నారు.

Comments

comments