Home మెదక్ ఏడుపాయలకు భారీగా భక్తజనం

ఏడుపాయలకు భారీగా భక్తజనం

EDUPAYALU-1

మనతెలంగాణ/పాపన్నపేట : ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దుర్గాభవాని ఆలయానికి 2017 నూతన సంవత్సర ప్రారంభం రోజు, ఆదివారం కావడంతో భక్తులు లక్షల సంఖ్యలో తరలి వచ్చారు. భుక్తులు హైదరాబాద్ నుండే కాకుండా పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల నుండే కాకుండా వివిద ప్రాంతాల నుండి భారీఎత్తున భుక్తలు తరలివచ్చి ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ నూతన సంవత్సరం బాగుండాలని కోరుకు న్నారు. ఆలయ అర్చకులు నర్సింహాచారి, శంకర్‌శర్మ, పార్థివశర్మ, రాజశేఖర్, మురళిచారి అమ్మవారికి ఉదయా న్నే పంచాంమృతంతో అభిషేకము చేసి వివిధ రకాల పూలు పండ్లుతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరిం చిన భక్తులు వేకువజాము నుండి ఆలయ సన్నిదిలో భక్తులు నిమగ్నమయ్యారు. లక్షల సంఖ్యంలో వచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. పోతరాజుల నృత్యాలతో, శివసత్తుల మేళాలలో, డప్పుచప్పుల్ల దరువులతో వనదుర్గా భవాని నమస్మరణ మార్మోగింది. కోంత మంది భక్తులు ఓడిబియ్యం, తలనీలాలు వివిధ రూపాలలో కానుకలను సమర్పించి వారి కోరికలు నేరవేరాలని కోరుకున్నారు. ఏడుపాయలకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ఆలయ ఈవో పి. వెంకటకిషన్‌రావు తగిన చర్యలు ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు సేవలందించారు.