Search
Monday 24 September 2018
  • :
  • :

చెరువులో విషం … భారీగా చేపల మృతి

Heavily Fish died in Pond

కృష్ణా : పెనమలూరు పేరంటాళ్లు చెరువులో భారీ సంఖ్యలో చేపలు మృతి చెందాయి. దీంతో తాము తీవ్రంగా నష్టపోయామని జాలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులో దుండగులు విషం కలిపారని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వారు చెరువు వద్ద ఆందోళనకు దిగారు. వాతావరణంలో మార్పులు రావడం వల్లనే చేపలు మృతి చెందాయని పంచాయతీ కార్యదర్శి కోటేశ్వరరావు జాలర్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ వారు మాత్రం దుండగులు చెరువులో విషం కలపడం వల్లనే చేపలు మృతి చెందాయని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. చేపల చెరువుపై కోర్టులో వివాదం నడుస్తోందని, ఈనేపథ్యంలో చెరువుపై గ్రామ ప్రజలకు ఎటువంటి హక్కు లేదని పంచాయతీ కార్యదర్శి కోటేశ్వరరావు పేర్కొన్నారు. వివాదం పెద్దదిగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి , న్యాయం జరిగేలా కృషి చేస్తామని చెప్పడంతో జాలర్లు శాంతించారు.

Heavily Fish died in Pond

Comments

comments