Home తాజా వార్తలు భారీగా హెరాయిన్‌ పట్టివేత

భారీగా హెరాయిన్‌ పట్టివేత

Heroin Seized at Delhi

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో భారీగా హెరాయిన్‌ పట్టుబడటం సంచలనం సృష్టించింది. గురువారం ఢిల్లీలోని ఆజాద్‌పుర మండీలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా హెరాయిన్‌ పట్టుబడింది. జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారా నుంచి వచ్చిన యాపిల్‌ పండ్లు నిల్వ చేసే కార్టన్లలో హెరాయిన్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనిని అక్రమంగా తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
జమ్మూకశ్మీర్‌ నుంచి అక్రమంగా హెరాయిన్‌ ఢిల్లీకి తరలించినట్లు పోలీసులు నిర్ధారించారు. పట్టుబడిన హెరాయిన్‌ విలువ సుమారు 200 కోట్ల రూపాయల ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందుతులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిన పోలీసులు ఈ అక్రమ దందాపై  సీరియస్‌గా దర్యాప్తు చేపట్టారు.
heavily heroin Captured in the New Delhi