Home నిర్మల్ బాసర క్షేత్రానికి వసంత పంచమి శోభ

బాసర క్షేత్రానికి వసంత పంచమి శోభ

Devoteesబాసర: భారతదేశంలోని పవిత్ర పుణ్య క్షేత్రమైన బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి క్షేత్రానికి వసంత (శ్రీపంచమి) శోభ వచ్చింది. బుధవారం వసంత పంచమి ఉత్సవాల ముగింపును పురస్కరించుకొని వేకువ జామున నుండి మంగళవాయిద్యాల సేవ, సుబ్రాత సేవతోపాటు మహాఅభిషే కం, అలంకణ నివేదన, మంగళహారతి. పూర్ణకుంభమేళం, భజభజంత్రి ల మధ్య గర్బగుడిలో వేదపండితుల మంత్రోచ్చరణ మధ్య శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మ వారికి ఉదయం 8 గంటల 30 నిమిషాలకు రాష్ట్ర దేవాదాయ,గృహా, న్యాయ శాఖ మంత్రి అల్లో ల ఇంద్రకరణ్‌రెడ్డి, ముథోల ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అమ్మవారిని పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బాసర క్షేత్రా నికి త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును తీసుకవచ్చేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

రాష్ట్రంలోని పురాతన దేవాలయాల పునరుద్ధరణ , మరమ్మతులను చేపట్టేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం దశలవారీగా విడుదల చేస్తుందన్నారు. తెలంగాణకే తలమానికమైన యాదాద్రి,వేములవాడ రాజన్న ఆలయ అభివృధ్ది పనులు కొనసాగుతున్నాయన్నారు. బాసర క్షేత్ర అభివృద్ధికి సైతం తాము కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. ఆలయాల పరిసరాల ప్రాంతాలు భక్తుల సౌకర్యర్థం మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. భక్తులకు ప్రత్యేకంగా కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆలయాధికా రులను ఆదేశించారు. బాసర క్షేత్ర ప్రాశస్తం దృష్య అలయ అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం సత్వర అభివృద్ధి కోరకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిందన్నారు. నిర్మల్ జిల్లాగా ఏర్పాడిన తర్వత తొలిసారిగా వసంత ప ంచమి వేడుకల్లో పాల్గొని అమ్మవారి పట్టువస్త్రాలను సమర్పించడం ఆనందంగా ఉందన్నారు. మంత్రి వెంట మాజీ డిసిసిబి చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, మాజీ పిఎసిఎస్ చైర్మన్ రామారావు, డిఎస్‌పి అందెరాములు, ముథోల్ సిఐ రఘుపతి, బాసర ఎస్సై మహేశ్, నాయకులు నర్సాగౌడ్, శ్రీనివాస్, తదితరులున్నారు.

అమ్మవారి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

వసంత పంచమి వేడుకలను పుర స్కరించుకోని బాసరలోని శ్రీ సరస్వతీ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తజనం పోటేత్తింది. మహారాష్ట్ర, ఉమ్మడి తెలుగురాష్ట్రాలు ఛత్తీస్‌గడ్, తమిళనాడు, కర్ణాటక , ప్రాంతాల నుండి భక్తులు బారీ సంఖ్యలో తరలివచ్చారు. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు.అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలనునిర్వహించి మొక్కులను తీర్చుకున్నారు. వసంత ప ంచమి వేడు కలను పురస్కరించుకోని అక్షరశ్రీకార పూజలు తమ చిన్నారులకు నిర్వహించేందుకు తల్లిదండ్రులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులతో ఆలయ ప రిసరాల ప్రాంతాలు కిటకిటలాడాయి. వేకువ జామున నుండి అమ్మవారి దర్శనానికి, అక్షర శ్రీకార పూజలకు క్యూలైన్‌లో నిల్చున్నారు.అమ్మవారి దర్శనానికి దాదాపు 5 గంటల సమయం పట్టింది.క్యూలైన్‌లో నిల్చున్న భక్తులకు మంచినీరు, పండ్లు, పాలు,బిస్కేట్లను పంపిణీచేశారు.

బాసర క్షేత్రంలో భారీ బందోబస్తు

పవిత్ర పుణ్యక్షేత్రమైన బాసరను వసంతపంచమి వేడుకలను పురస్కరించుకోని పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో గట్టిబందోబస్తును నిర్వహించారు. భైంసా డీఎస్పీ అందెరాములు బందోబస్తును పర్యవేక్షించి సూచనాలిచ్చారు. బందోబస్తులు ముగ్గురు సిఐలు, 20 మంది ఎస్సైలు, 150 కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ 100, హోంగార్డులు 50 మహిళ కానిస్టేబుల్స్‌లు మంది పాల్గొన్నట్లు తెలిపారు.బాంబు స్కాడ్ ,జాగీలాలు ,ప్రత్యేక ప్రభుత్వ ధళాల సిబ్బంది బందోబస్తులోపాల్గొన్నారు.

సేవా కార్యక్రమాల్లో విద్యార్థులు, యువకులు

వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్యూలైన్‌లో, అక్షర శ్రీకార మండపంలో, గర్బగుడిలో, ప్రధాన కూడళ్ల వద్ద, లడ్డూ ప్రసాదాల వద్ద ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు, యువకులు, మిషన్ బాసర సభ్యులు, ట్రిపుల్ ఐటి బాసర విద్యార్థులు అదేవిధంగా అఖిల భారత పద్మశాలి సేవ సంఘం హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో భక్తులకు పాలు, బిస్కెట్లు, తాగునీరు, అందించారు. విద్యా ర్థులు, మిషన్ బాసర సభ్యులు, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులను మంత్రి అభి నందించారు.

పాలు ఇచ్చారు…. నీళ్లు మరిచారు

వసంత పంచమి వేడుకలను పురస్కరించుకోని అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు క్యూలైన్లు, అక్షశ్రీకార మండపం వద్ద భక్తులు గంట ల తరబడి నిల్చు న్నారు. భక్తులకు ఆలయాధికారులు పాలుఇచ్చి నీళ్లు మరవడంతో ఆలయా ధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తాగాడానికి నీళ్లు ఇవ్వర అని ప్రశ్నించారు. వేకువ జామున నుండి క్యూలైన్‌లో నిల్చున్న భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. ఆలయాధికారులకు వ్యతిరేఖంగా భక్తులు ఒక దశలోనినాదాలు సైతం చేశారు. ఏర్పాట్లలో అక్కడక్క లోపాలున్నా అధికా రులు గుర్తించకపోవడం గమనార్హం .
ఏర్పాట్లలో అధికారుల వైఫల్యం

వసంత పంచమి వేడుకలను పురస్కరించుకొని బాసర క్షేత్రానికి తరలివచ్చిన భక్తులకు ఆలయాధికారులు కనీస వసతులు కల్పించడంలో విఫలమైనట్లు భక్తులు ఆరోపించారు. మూడురోజుపాటు జరిగే ఉత్సవాలకు లక్షసంఖ్యలో భక్తులు వస్తారని తెలిసిన ఏర్పాట్లు ఆశించిన స్థాయిలో జరగలేకపోవడంపై భక్తులు అధికారులపై మండిపడ్డారు. పెద్ద ఎత్తున ఉత్సవాలు చేస్తు భారీ సంఖ్య లో భక్తులు తరలివచ్చే విధంగా ప్రచారం నిర్వహిస్తున్న అధికారులు సౌకర్యలు కల్పించడంలోమాత్రం విఫలమవుతున్నారని భక్తులు పేర్కొన్నారు.

భారీగా పెంచిన ప్రైవేటు లాడ్జీ అద్దెలు

వసంత పంచమి వేడుకలను పురస్కరించుకొని అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు తిరుమల తిరపతి దేవస్థానం, యాదగిరిగుట్ట, రాజన్న నిలయం, వేములవాడ, శ్రీశైలం తదితర వసతి గృహాల్లో గదులు దొరకలేదు. దీంతో ప్రైవేట్ లాడ్జిల్లో అద్దెలు ఆకాశన్నంటాయి. లాడ్జి యాజమానులు భక్తుల అవస రాలను ఆసరగాతీసుకొని వేలల్లో అద్దెలను వసూల్ చేశారు. అధికారులు భక్తుల బసకు ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రైవేటు లాడ్జీల యాజమాన్యం అద్దెలు పెద్ద మొత్తంలో తీసుకున్నారు.