Home తాజా వార్తలు జపాన్‌లో భారీ భూకంపం…. సునామీ హెచ్చరికలు జారీ

జపాన్‌లో భారీ భూకంపం…. సునామీ హెచ్చరికలు జారీ

Tsunami3

టోక్యో: జపాన్ ఈశాన్య ప్రాంతంలో మంగళవారం ఉదయం భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.3గా నమోదైంది. భూమికి 11 కిలో మీటర్ల లోతులో భూమి కదలికలు సంభవించినట్లు భూ పరిశోధన శాస్త్ర వేత్తలు గుర్తించారు. భూకంప సమయంలో దాదాపుగా సముద్రపు అలలు 3 మీటర్ల ఎత్తున ఎగిసిపడ్డాయి. దీంతో జపాన్ ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఫుకుషిమా నగరానికి 37 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. రాకాసి అలలు ఫుకుషిమా అణుశక్తి కేంద్రాన్ని ముంచెత్తాయి. టోక్యో తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. న్యూజిలాండ్, ఉత్తరు ఐలాండ్‌లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. ఆస్థి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు.