Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

రెప్పపాటులో… కబళించిన మృత్యువు…

Heavy fire in the city where death is fatal

నగరంలో భారీ అగ్ని ప్రమాదం..

ఓరుగల్లులో భారీ విస్పోటనం                                                                                                                                                              పేలిన బాణాసంచా తయారీ కేంద్రం
10 మంది మృతి, మరో 8 మంది క్షతగాత్రులు                                                                                                                                          మాంసపు ముద్దలైన మృతదేహాలు
హృదయాల్ని దహించి వేసిన అగ్రిప్రమాద ఘటన
చిన్నారులను చూసి కన్నీళ్లు పెట్టుకున్న జనం                                                                                                                                  మృతుల్లో మహిళలే ఎక్కువ…

మన తెలంగాణ/వరంగల్ అర్బన్ / వరంగల్ క్రైమ్ : వరంగల్ నగరంలోని కోటిలింగల గుడి వద్ద గల భద్రకాళి ఫైర్ వర్క్ కంపెనిలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన బుధవారం వరంగల్ నగరంలోని నడిబొడ్డు ఉన్నా కోటిలింగల గుడి వద్ద గల భద్రకాళి ఫైర్ వర్క్‌లో ఘోర అగ్ని ప్రమాదం ఉదయం 11 గంటల సమయంలో నెలకొంది… అయితే రోజు మాదిరిగానే దినసరి కూలీలు పనికి వెళ్లీన వారు 22మంది.. బంబుల కొనుగోలు చేసేందుకు వచ్చిన వారు ఐదుగురు.. వారి ప్రాణాలు రెప్పపాటులో మంటలో కాళి… బుగ్గిపోయినవి… ఈ ప్రమాదం గురించి తెల్సిన వెంటనే డిప్యూటి సిఎం కడియం శ్రీహరి సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్య వేక్షించారు…  క్షతగాత్రులకు, మృతుల కుటుంబాలకు రూ.ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియాన్, సిఎం కెసిఆ సానుభూతిని డిప్యూటి సిఎం తెలియాపరిచారు.
భూకంపం అంటే ఎలా ఉంటుందో తెలియదు కాని, వరంగల్ చరిత్రలోనే తొలిసారిగా భూపంకాన్ని తలపించిన ప్రమాధం వరంగల్ నగరంలోని కోటిలింగాల ప్రాంతంలో నగరానికి ఆనుకొని ఉన్న భద్రకాళి ఫైర్‌వర్క్ ఫ్యాక్టరీలో బుధవారం భారీ అగ్నిప్రమాధం చోటుచేసుకుంది. ఈ ప్రమాధంలో 11 మందికి పైగా కార్మికులు సజీవదహనం కాగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. స్థానికులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం గత 20 సంవత్సరాల నుండి నగరానికి ఆనుకొని ఉంటుందని, గత పది సంవత్సరాల క్రితం పక్కనే ఉన్న మరొక బాంబుల ఫ్యాక్టరీలో కూడా అగ్నిప్రమాధం జరిగిందని, ఎవరికి ప్రాణ నష్టం జరుగకుండా తీవ్ర గాయాలతో బయటపడ్డ సంఘటన చోటుచేసుకుందని, గతంలో జరిగినప్పటికి నగరంకు ఆనుకొని ఉన్న బాంబుల ఫ్యాక్టరీలను తీసివేయడం లేదా ఆరుబయటకు మార్చే ప్రయత్నం కూడా అధికారులు చేయలేదని, అదే విధంగా బాంబుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాధం జరిగినప్పుడు మంటలను ఆర్పేందుకు సరైన సేఫ్టి పరికరాలు లేవని ఆవేధన వ్యక్తం చేశారు. అదే విధంగా ఇందులో పనిచేసే కూలీలలకు ఎలాంటి గుర్తింపును కల్పించేదని, ఇందులో పనిచేసే కూలీలు నిరుపేద కుటుంబానికి చెందిన వారని రోజు వారిగా కూలీ చేస్తే కాని పూట గడవని కూలీలను పనిలో పెట్టుకున్నారన్నారు. ఈ ఫ్యాక్టరీలో రోజు వారిగా 22 మంది కూలీలు పనిచేసేవారని జరిగిన సంఘటనలో మాత్రం ఎంత మంది కూలీలు ఉన్నారో తెలియలేదని కుటింబీకులు కన్నీటిపర్వంతమయ్యారు.
నగరంలోని భద్రకాళి ఫైర్ వర్క్‌లో బాణసంచా తయారి కేంద్రాంలో నిర్లక్షానికి నిలుపుటద్దంగా మారింది..ప్రభుత్వం సూచించే రక్షణ చర్యలను పెడచెవిని పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి…ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసే అధికార యంత్రాంగం రెండు మూడు రోజుల పాటు ఎలాంటి చర్యలు తీసుకోకుండానే వదిలేయడం పరిపాటిగా మారింది. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో భద్రకాళి ఫైర్ వర్క్‌లో గోడౌన్లలో జరిగిన అగ్నిప్రమాదం ఇందుకు ఓ ఉదాహరణ..బాణాసంచ తయారి కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో పలువురి ఆవయాలు ముక్కలు…ముక్కలుగా సుమారుగా వంద మీటర్ల పైగా ఎగిరిపడినవి….ఈ ప్రమాదంతో ప్రాణనష్టం సుమారుగా 22మంది మృతి చెందిన్నట్లుగా తెలుస్తుంది. అయితే అగ్నిప్రమాదంలో 22మందికి కార్మికులున్నట్లుగా….అయితే బాంబుల పెళ్లులకు బాంబుల తయారి ఎదుట ఉన్నా పలు ఇళ్లు పై ఉన్నా రేకులు ఎగిరిపోయినావి, తలుపు సైతం పగిలిపోయినవి…బంగ్లాలకు కూడా కపించిపోయినవి…సుమారుగా రెండు మీటర్ల వరకు బాంబుల శబ్ధంతో..రెండు గంటల వరకు మారుమోగింది…ఈ అగ్నిప్రమాదంలో స్థానిక ప్రజలు, అధికార యంత్రాంగం ఎన్నో గంటల పాటు పోరాడి మంటలను అదువులోకి తీసుకొచ్చారు. ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసి ఆ తర్వాత మరచిపోతున్నారు.
అగ్నిప్రమాదం చోటుకు చెరుకున్నా పలువురు ఎంఎల్‌ఎలు, అధికారులు
కోటిలింగల గుడి వద్ద జరిగిన భారీ అగ్నిప్రమాదం వద్దకు పరకాల ఎంఎల్‌ఎ చల్లా ధర్మరెడ్డి, వర్ధన్నపేట ఎంఎల్‌ఎ అరూరి రమేష్, తూర్పు ఎంఎల్‌ఎ కొండా సురేఖ, ఏనుమాముల మార్కెట్ చైర్మన్ కొంపెల్లి ధర్మరాజు, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత, ఆర్‌డిఒ వెంకరెడ్డి, డిసిపి మురళీధర్‌రెడ్డి, ఫైర్ అధికారి భగవన్‌రెడ్డి, ఎసిపిలు శోభన్‌బాబు, మధుసుధన్, సిఐలు, రెవెన్యూ అధికారులతో పాటు మాజీ ఎంఎల్‌ఎ కె.శ్రీధర్, మాజీ మేయర్ స్వర్ణ, గ్రేటర్ అధ్యక్షుడు రాజనాల శ్రీహరి, టిడిపి పార్టీ నాయకుడు ఈగ మల్లేశం, బిజెపి పార్టీ నాయకులు హరిశంకర్, రంజిత్, టిఆర్‌ఎస్ పార్టీ కార్పొరేటర్ల, నాయకులు, నాయకురాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వచ్చారు.
* అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి….ఎస్‌కె.అబ్జుల్ (ఎన్‌టిఆర్ నగర్)
అధికారులు వెంటనే చర్యలు తీసుకుని జనావాసాల ఉన్న చోట నుంచి తీసివేయాలి…గతంలో కూడా ఇలాంటి ప్రమాదం జరిగిన సంఘటనలు ఉన్నాయి….అప్పుడు ఇద్దరు మృతి చెందిన్నారు.
ప్రభుత్వం అదుకోవాలి…ఎల్.రాము (గొర్రెకుంట)
ఈ ఫైర్ వర్క్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరంగా అదుకోవాలి, వారి కుటుంబా సభ్యులలో ఒక్కరి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి, అలాగే క్షతగాత్రుల కుటుంబాలను ఆర్థికంగా అదుకోవాల్సిందిగాని ఆయన కొరారు..
తరలోచ్చిన నేతలు
సంఘటన విషయాన్ని తెలుసుకున్న ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సందర్శించారు. సంఘటనపై ఆరా తీశారు. స్థానికులతో పాటు, అప్పటికే సంఘటనతో తలమునకలైన అధికారులను విషయాలు అడిగి తెలుసుకున్నారు.
సంఘటన స్థలాన్ని సందర్శించిన వివిధ రాజకీయపార్టీ నేతలు
సంఘటన స్థలానికి సిపిఎం, టిడిపి, కాంగ్రెస్ తదితర పార్టీల నేతలు సందర్శించారు. సిపిఎం నేతలు జి.నాగయ్య, యం. చుక్కయ్యతో పాటు సిపిఎం నేతలు సందర్శించారు. టిఆర్‌ఎస్ మహబూబాబాద్ నాయకులు మాలోతు బిక్షపతి నాయక్ సంఘటన స్థలానికి చేరుకొని సందర్శించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేశం సంఘటన స్థలానికి చేరుకొని తీవ్ర దిగ్భంది చేందారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు చూసి చలించిపోయారు. మృతుల కుటుంబాలకు చెందిన పిల్లలను ఎన్‌టిఆర్‌ట్రస్టు ద్వారా చదువులకు తొడ్పాడు అందిస్తామని తెలిపారు.
రూ.5వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.

Comments

comments