Home జయశంకర్ భూపాలపల్లి గోదావరి నదిలో పెరుగుతున్న ఉదృతి

గోదావరి నదిలో పెరుగుతున్న ఉదృతి

Heavy Flood Come To Godavari River In Jayashankar Dist

మంగపేట: మండలంలో గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తుంది. గత నాలుగు రోజులుగా ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర , చత్తీష్‌ఘడ్ తదితర ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరిలోకి వరద నీరు ఉప్పెనల వచ్చి చేరుతుంది. దీంతో ఒక్కసారిగా వరద ఉదృతి ఎక్కువ అయ్యింది. కమలాపురంలోని బిల్ట్ ఇంటెక్‌వెల్ వద్ద సుమారు 8 మీటర్ల ఎత్తులో గోదావరి విశాలంగా ప్రవహిస్తు చూపురులను ఆకట్టుకుంటుంది. గోదావరి నధీ ఉదృతంగా ప్రవహిస్తుండడంతో మండలంలోని ఆయా ప్రాంతాల ప్రజలు గోదావరి చూసేందుకు బారులు తీరుతున్నారు. మరి కొన్ని రోజులు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటనలు చేయడంతో మరింత పెరిగే అవకాశం ఉన్నదని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. దీంతో రెవెన్యూ పోలీస్ అధికారులు అప్పమత్తమై లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇందులో బాగంగానే మంగపేట తహశీల్దార్ అంటి నాగరాజు నిత్యం గోదావరి నదిని పరిశీలుస్తు తగు చర్యలు తీసుకుంటున్నారు.