Home జాతీయ వార్తలు ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరదనీరు

ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరదనీరు

Heavy Flood Water Flow in Prakasam Barrage

అమరావతి : ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజ్ జలకళను సంతరించుకుంది. ప్రస్తుతం ఈ బ్యారేజ్ నీటి మట్టం 12 అడుగులకు చేరుకుందని అధికారులు తెలిపారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బ్యారేజ్‌కు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో నాలుగు గేట్లను అడుగు మేర ఎత్తి 2,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అదేవిధంగా డెల్టా కాలువకు 11,500క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బ్యారేజ్ జలకళ సంతరించుకోవడంతో పర్యాటకుల తాకిడి మొదలైంది.