Home జాతీయ వార్తలు శ్రీశైలం ప్రాజెక్టు … మూడు గేట్లు ఎత్తివేత

శ్రీశైలం ప్రాజెక్టు … మూడు గేట్లు ఎత్తివేత

Heavy Flood Water Inflow to Srisailam Project

నాగర్‌కర్నూల్ : శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. భారీగా వరదనీరు వచ్చి చేరుతుండడంతో మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,86,996 క్యూసెక్కులుగా ఉంది. ఔట్‌ఫ్లో 1,81,733 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 883.40 అడుగులు. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుత నీటి నిల్వ 206.53 టిఎంసిలు. పూర్తిస్థాయి నీటినిల్వ 215 టిఎంసిలుగా ఉంది.

Heavy Flood Water Inflow to Srisailam Project