కర్నూలు : ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుంచి 3,62,098క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శుక్రవారం సాయంత్రం ఆరు గంటల వరకు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను 878.80 అడుగులకు చేరింది. దీంతో ప్రాజెక్టులో 192 టిఎంసిల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థం 215.8 టిఎంసిలు, ప్రాజెక్టు నుంచి ఔట్‌ఫ్లో 1,04,392 క్యూసెక్కులుగా నమోదైందని. ఎపి పవర్ హౌజ్‌కు 32382 క్యూసెక్కులు, తెలంగాణ పవర్ హౌజ్‌కు 42378క్యూసెక్కులు, హంద్రీనివా ప్రాజెక్టుకు 2025 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు 26000 క్యూసెక్కులు, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1600 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్టు అధికారులు వెల్లడించారు. నాగార్జున జలాశయానికి 74,232 క్యూసెక్కుల నీటిని వదిలారు.