Home జాతీయ వార్తలు శ్రీశైలానికి భారీగా వరద నీరు

శ్రీశైలానికి భారీగా వరద నీరు

srishailamకర్నూలు : శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 868.80 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 2.49 లక్షల క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో 75.527 క్యూసెక్కులుగా ఉంది. అదేవిధంగా ఆల్మట్టి డ్యాంనకు ఇన్‌ఫో 2.14లక్షలుగా ఉండగా, ఔట్‌ఫ్లో 2.21లక్షల క్యూసెక్కులుగా ఉంది. జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 2.35లక్షలుగా ఉండగా, ఔట్‌ఫ్లో 2.53 లక్షల క్యూసెక్కులుగా ఉంది.