Friday, April 19, 2024

తెలంగాణలో భారీ వర్షాలు…. రెడ్ అలర్ట్

- Advertisement -
- Advertisement -

Heavy flooded in Telangana

హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.  ఈ నెల 14 వరకు తెలంగాణలోని కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. సిద్ధిపేట, కరీంనగర్, ములుగు, రాజన్న సిరిసిల్ల, జనగామ, సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, కొత్తగూడెం, కామారెడ్డి, హనుమకొండ, మెదక్, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. నిర్మల్, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఓ వైపు ఒడిశా పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడిందని, దానికి అనుబంధంగా ఉపరితలం ఆవర్తనం విస్తరించి ఉండడంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News