Home మంచిర్యాల అలుముకున్న దట్టమైన పొగమంచు

అలుముకున్న దట్టమైన పొగమంచు

Snow

కాసిపేట : వాతవరణంలో చోటు చేసుకుంటున్న మార్పులతో  ప్రజలు అల్లాడిపోతున్నారు.  వాతవరణంలో మార్పు చెందడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం ఉదయం మెత్తం పొగమంచుతో గ్రామాలను ముంచివేసింది. ఉదయం పొగమంచు వీడకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శీతాకాలంలో  ఢిల్లీ ప్రాంతంలో, అలాగే ఆంద్రప్రదేశ్‌లోని  లంబసింగిలో వుండే వాతావరణాన్ని ఇక్కడి ప్రజలు ఆదివారం చవిచూసారు.

ఉదయం బయటకు వెళ్లిన పొగమంచుతో ఎమి కనబడని పరిస్థితులు తల్తెయి. రహదారిపై వాహనాలు లైట్లు వేసుకునే ప్రయాణం చేసారు. రైల్వే లైన్లు, సిగ్నల్స్ కూడా పొగమంచుతో వుండడంతో రైళ్ళు కూడా ఆలస్యంగా నడిచాయి. ఉదయం ఎటుచూసిన గృహాలు కూడా కనిపించని పరిస్థితులు తలెత్తాయి. కొందరు మాత్రం  ఈ ఆహ్లాదాన్ని ఆనందం పంచుకున్నారు. వారు పొగమంచులో తిరుగుతూ ఆనందం వ్యక్తం చేసారు.