Home బిజినెస్ బెంగాల్‌లో భారీ పెట్టుబడులు

బెంగాల్‌లో భారీ పెట్టుబడులు

bsns2

కోల్‌కతా: వచ్చే మూడేళ్లలో పశ్చిమబెంగాల్‌లో జియో యేతర వ్యాపారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.5 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనుందని కంపెనీ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. రిటైల్ పెట్రోలియం ఔట్‌లెట్లు వంటి వాటి ద్వారా ఇన్వెస్ట్ చేయనున్నట్టు మంగళవారం పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన వార్షిక ఇన్వెస్టర్ల సదస్సు ‘బెంగాల్ బిజినెస్ గ్లోబల్ సమ్మిట్’లో ఆయన తెలిపారు. కొత్త పెట్రోలియం పంపులు ఏర్పాటు చేయనున్నామని, ప్రస్తుతం ఉన్న పెట్రోలియం పంప్‌లలో కొన్నింటిని తెరిచేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ మానుఫ్యాక్చరింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు తెలిపారు. మొబైల్ ఫోన్ తయారీ, టెలివిజన్ సెట్‌లు, సెట్ టాప్ బాక్స్(ఎస్‌టిబి)ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ముఖేష్ అంబానీ చెప్పారు. అలాగే బెంగాల్‌లో జియో సేవలను మరింతగా విస్తరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామా ల్లో మెరుగైన కనెక్టివిటీ తేనున్నామని అన్నారు. స్కూళ్లు, కళాశాలలు, యూనివర్సిటీలు సహా విద్యా సంస్థల్లో ఆప్టిక్ ఫైబర్ నెట్‌వర్క్‌ను విస్తరించనున్నామని అన్నారు. 2019 నాటికి తమ ఫైబర్ నెట్‌వర్క్ ద్వారా బెంగాల్‌లో 100 శా తం గ్రామాలను కవర్ చేయనున్నామని అంబానీ తెలిపారు. రిలయన్స్ సంస్థ రాష్ట్రంలో అత్యంత పెద్ద ఇన్వెస్టర్ గా మారిందని అన్నారు. మెరుగైన 4జి సేవల కోసం జియో ఫోన్‌లను మరింతగా వ్యాప్తి చేయనున్నామని, పోన్లను పెంచేందుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని అన్నారు.