Home జాతీయ వార్తలు ఎస్‌బిఐ బ్యాంకులో దోపిడి

ఎస్‌బిఐ బ్యాంకులో దోపిడి

Heavy Loot in SBI Bank at Anantapur

అనంతపురం: జెఎన్ టియు క్యాంపస్‌లోని ఎస్‌బిఐ బ్యాంకులో శనివారం చోరి జరిగింది. బ్యాంకు వెనక వైపు కిటికీ పగలగొట్టి దుండగులు లోపలికి చొరబడ్డారు. బ్యాంకు స్ట్రాంగ్‌రూమ్‌లో రూ.39.15 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. గ్యాస్‌కట్టర్‌తో స్ట్రాంగ్‌రూంను దుండగులు పగలగొట్టారు. కిటికీలు, స్ట్రాంగ్‌రూమ్ తలుపులపై నుంచి క్లూస్‌టీమ్ వేలిముద్రలను సేకరిస్తున్నారు. సిసిటివి పుటేజీలు పరిశీలిస్తున్న పోలీసులు డాగ్‌స్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిఉంది.