Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

భారీ ధర పలికిన జాతిపిత స్టాంపులు

STAMPS

లండన్ : భారత జాతిపిత మహాత్మాగాంధీ చిత్రంతో ఉన్న అరుదైన స్టాంపులు యుకెలో వేసిన వేలంలో భారీ ధర పలికాయి. యుకెలోని స్టాన్లీ గిబ్బన్స్ అనే స్టాంప్ కలెక్టింగ్ కంపెనీ జాతిపిత చిత్రంతో ఉన్న నాలుగు స్టాంపులను వేలం వేసింది. ఈ స్టాంపులకు రికార్డు స్థాయిలో ఐదు లక్షల( భారత కరెన్సీలో రూ.4.1 కోట్లు) పౌండ్లు పలికాయి. ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి వీటిని దక్కించుకున్నాడు. యుకెలో భారత స్టాంప్‌కు ఇంత ధర పలకడం ఇదే తొలిసారి. 1948 నాటి పది రూపాయల విలువ గల మహాత్ముడి స్టాంపులు కేవలం 13 మాత్రమే చలామణిలో ఉన్నట్లు వేలం నిర్వాహకులు వెల్లడించారు. ఇందులో నాలుగు స్టాంపులను ఇప్పుడు వేలం వేశారు. మరో నాలుగు రాయల్ ఫిలాటెలిక్ కలెక్షన్ హౌస్‌లో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కలెక్షన్ హౌస్ బ్రిటన్ రాణి ఎలిజబెత్ -2కు చెందినది కావడం గమనార్హం.

Comments

comments