Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

లాభాల ‘లెమన్’

నిమ్మ గడ్డి సాగుపై రైతుల ఆసక్తి
లెమన్ ఆయిల్‌కు మార్కెట్‌లో భలే గిరాకీ
అశ్వారావుపేటలో జోరుగా సాగు

Lemon-Oil

వినూత్న పంటలకు నిలయమైన గిరిజన నియోజకవర్గమైన అశ్వారావుపేటలో మరో కొత్త పంటను సాగు చేసేందుకు రైతులు
ఆసక్తి చూపుతున్నారు. వివిధ రకాల పంటల సాగు అనుకూలమైన నెలలు, సమృధిగా నీరు, పంటకు అనుకూలమైన వాతావరణం అశ్వారావుపేట, దమ్మపేట,ములకలపల్లి మండలాల్లో ఉండటంతో ఈ ప్రాంత రైతులు కొత్త రకాల పంటలపై రోజు రోజుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ప్రాంతంలో పామాయిల్, జీడి మామిడి, యాపిల్ బేర్, బంతిపూల సాగు, తైవాన్ జామ, కూరగాయల పంటలు మాత్రమే సాగు చేస్తున్నారు. ఇపుడు తాజాగా రైతులు లెమన్ గ్రాస్(నిమ్మ గడ్డి) సాగు చేయటం ప్రారంభించారు.

ఒడిస్సా రాష్ట్రానికి పరిమితమైన లెమన్ గ్రాస్ సాగు ఇపుడు తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని అచ్చుతాపురం, నారంవారిగూడెం, గంగారం గ్రామాల్లో సాగవుతోంది. ఈ మూడు గ్రామాల పరిధిలోని బోల్లిన నరేష్, గారపాటి రాంబాబు అనే రైతులు సుమారుగా 70 ఎకరాల్లో లెమన్ గ్రాస్ సాగు చేస్తున్నారు. పంట ద్వారా వచ్చే నిమ్మ నూనెను హైదార బాద్, ముంబాయితోపాటు ఇతర దేశాలకు ఎగుమతి అవుతోంది. రైతులు తయారు చేసిన నూనెను కొందరు వ్యాపారులు వచ్చి రైతుల వద్ద నుండి కొనుగోలు చేస్తారు. కిలో లెమన్ నూనె ధర రూ.600 నుండి రూ.900ల వరకు ఉంటుందని రైతులుచెపుతున్నారు.

ఒడిస్సా నుంచి విత్తనాల దిగుమతి….
లెమన్ గ్రాస్ సాగు అధికంగా ఒడిసా రాష్ట్రంలో చేస్తుండటతో స్ధానిక రైతులు పంటను సాగు చేసేందుకు ఒడిసా నుండి విత్తనాల
ను తీసుకొస్తున్నారు. ఒడిసాలోని వ్యవసాయ యునివర్సీటి, హైదారబాదులో గల వ్యవసాయ యునివర్సీటిలో మాత్రమే ఈ విత్తనాలు అందుబాటులో ఉండగా , దూరమైన శ్రమ కొర్చి రైతు లు ఒడిసా రాష్ట్రం నుండే విత్తనాలను తెచ్చి లెమన్ గ్రాస్ పంటను సాగు చేస్తున్నారు. గడ్డి విత్తనం నాటిన నాటి నుండి 90 రోజలు తరువాత పంట చేతికందుతుంది. లెమన్ గ్రాస్ ఏపుగా ఎదిగిన తరువాత ప్రతి రెండు నెలలకు ఒక సారి చొపున గడ్డిని కోసి ఆరబెడతారు.

తరువాత లెమన్ గ్రాస్‌ను ప్లాంట్‌లో వేసి ఆవిరి ద్వారా ఉడికించి నిమ్మ నూనెను దిగుమతి చేసుకుంటారు. ఈపంటను ఎకరం పొలంలో సాగు చేసేందుకు రైతులకు లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది. లెమన్ గ్రాస్ పంట చేతి కందిన తరువాత, నూనెను ఉత్పత్తి చేసేందుకు మరో రూ.5 లక్షల రూపాయలతో పొలంలోనే ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక్క సారి ఏర్పాటు చేసుకున్న ప్లాంట్ రైతులకు మిగిలిపోతుండగా, రెండోవ సారి సాగు చేసే పంటకు ప్లాంట్ ఖర్చు ఉండదు. ఎకరం పంట ద్వారా దాదాపు 13 కేజీల వరకు నిమ్మ నూనె దిగుబడి వస్తుంది.

సుమారుగా రూ.12వేల వరకు ఆదాయం వస్తుంది. నిత్యం సుమారుగా వంద మంది కూలీలకు జీవనోపాధి కలుగు తుందని రైతులు చెపుతున్నారు. ఈ పంట వల్ల శ్రమ తక్కువ ఆదా యం ఎక్కువగా ఉంటుంది. లెమన్ గ్రాస్ సాగుకు ఒడిసా రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం విత్తనాలపై రాయితీలు ఇస్తుండగా, తెలంగాణాలో ఆ అవకాశం లేకపోవడంతో రైతులపై కొంత మేర భారం పడుతున్నట్లు సాగు చేస్తున్న రైతులు చెపుతున్నారు. మంచి దిగు బడి, అధిక ఆదాయం, కూలీలకు జీవోనపాధి కల్పిస్తున్న లెమన్ గ్రాస్ విత్తనాలపై రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇస్తూ ఎక్కువ మంది రైతులు సాగు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Comments

comments