Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

జలమయమైన తెల్లాపూర్ రోడ్లు…

Heavy-Rain-Fall

మెదక్: గురువారం కురిసిన వర్షం స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేసింది. మండల పరిధిలో ఆశించిన స్థాయిలో వర్షం పడకపోయినా తెల్లాపూర్ గ్రామాన్ని పూర్తిగా ముంచెత్తివేసింది. తెల్లాపూర్ గ్రామంలో గురువారం కురిసిన భారీ వర్షానికి కాలనీలన్నీ జలమయమయ్యాయి. తెల్లాపూర్ ప్రధాన రహదారి వర్షపునీటితో నిండిపోవడంతో గ్రామస్తులు ఒకింత ఇబ్బందులకు గురయ్యారు. వర్షపునీరు పారేందుకు సరైన పైప్‌లైన్ వ్యవస్థ లేకపోవడంతో నీరంతా ఎక్కడికక్కడే నిలిచిపోయింది. రోడ్ల మీదు వర్షపునీరు నిలిచి వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నీరు నిల్వ ఉండటం వల్ల అనేక రోగాలు వస్తాయని కాలనీవాసులు భయపడుతున్నారు. వర్షపు నీరు పోయేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. డ్రైనేజీలో వర్షపునీరు నిండి చెత్త, చెదారం పేరుకుపోవడంతో డ్రైనేజీ నీరంతా రోడ్లపై నిలిచిపోతుంది. మరోవైపు పాఠశాలకు వెళ్లే విద్యార్థులు వర్షం కారణంగా నానా ఇబ్బందులకు గురయ్యారు. కొన్ని చోట్ల వర్షం నీటిలో ద్విచక్ర వాహనదారులు ఇరుక్కుపోయి బయటకు వచ్చేందుకు అష్టకష్టాలుపడ్డారు.

Comments

comments