Home తాజా వార్తలు తెలంగాణకు అతి భారీ వర్ష సూచన…!

తెలంగాణకు అతి భారీ వర్ష సూచన…!

Heavy Rain Forecast for Telangana in Next 3 Days

హైదరాబాద్: రాగల మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. మంత్రులంతా జిల్లాల్లోనే ఉండి పరిస్థితిని సమీక్షించాలని సిఎం ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారులంతా స్థానికంగానే ఉండి సహాయక చర్యలు చేపట్టాలని తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని సిఎస్ ఎస్‌కె జోషికి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు జిల్లాల్లో ఉండాల్సినందున సోమవారం జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది.