Home తాజా వార్తలు నగరంలో పలుచోట్ల వర్షం… ఒకరు మృతి

నగరంలో పలుచోట్ల వర్షం… ఒకరు మృతి

మన తెలంగాణ, సిటీబ్యూరో: నగరవాసులకు ఎండవేడిమి నుంచి కాస్త ఉపశమనం కలిగింది. శనివారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురువగా, మరికొన్ని చోట్ల చిరుజల్లులు పడ్డాయి. శివారు ప్రాంతాలైన హయత్‌నగర్, వనస్దలిపురం, ఎల్బీనగర్, దిల్‌షుక్‌నగర్, ఉప్పల్, తార్నాక, ఓయూ క్యాంపస్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, చార్మినార్, బహదూర్‌పురా, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్టతో పాటు పెద్ద అంబర్‌పేట, అబ్దులాపూర్‌మెట్ భారీ వాన కురిసింది. పలుచోట్ల ఈదురుగాలులు వీచడంతో పాటు వడగళ్లు పడ్డాయి. శనివారం పడ్డ వానకు 18చోట్ల వరదనీరు సమస్య ఏర్పడగా, 47 చోట్ల గాలులకు చెట్లు కూలిపోయాయి. కొత్తపేట, మలక్‌పేట, దిల్‌షుక్‌నగర్ వంటి చోట్ల కురిసిన వానకు రోడ్లలన్ని జలమయంగా మారాయి. మధ్యాహ్నం వర్షం పడటంతో ప్రధాన రహదారులు నీటి వరదను ముంచెత్తాయి.

దీంతో వాహనదారులు గంటల తరబడి రోడ్లపై ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బందులు పడ్డారు. తరువాత విపత్తు నిర్వహణ బృందాలు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి వరద నీరు ఎక్కువగా నిలిచినచోట మ్యాన్‌హోల్ మూతలు తెరిచి నీటి పంపించారు. గౌలిగూడ చమన్, ఐఎస్‌ఐసదన్,సైదాబాద్, చాంద్రాయణగుట్ట, నూర్‌ఖాన్ బజార్, మొగల్‌పురా,కామినేని ఆసుపత్రి వంటి ప్రదేశాల్లో చెట్లు నేలమట్టం కావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురైయ్యారు. పెద్ద ఎత్తున గాలులు వస్తాయని రోడ్డపై రాకుండా జాగ్రత్తలు పడ్డారు. దీంతో సైదాబాద్, ఫలక్‌నుమా,మెహిదిపట్నం, చాంద్రాయణగుట్ట, దిల్‌షుక్‌నగర్, మలక్‌పేట, హయత్‌నగర్‌లో గంట పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పాతబస్తీలో మూడుచోట్ల విద్యుత్ స్దంబాలు గాలికి కూలిపోయాయి ఐదుగంటలపాటు కరెంటు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
జుపార్కులో చెట్టు కూలి మహిళ మృతి: నిత్యం సందర్శకులతో కిటకిటలాడే జుపార్కులో భారీ వర్షానికి 20 చెట్లు కూలగా, పలు చెట్లకు కొమ్మలు విరగాయి. ఓమహిళ మృతి చెందడంతో పాటు పలువురి గాయాలైయ్యాయి.దీంతో జుపార్కు అధికారులు అప్రమత్తమై పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించి కాపాడారు. మణికొండ పుప్పాల్‌గూడకు చెందిన నికిత్ సుల్తానా (60)మహిళ మృత్యువాత పడింది. దీంతో అధికారులు మృతురాలు కుటుంబానికి రూ. 5లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. నేడు జూపార్కుకు సెలవు ప్రకటిస్తున్నామని,పర్యాటకులు సహాకరించాలని కోరారు.

Heavy rain in Hyderabad