Tuesday, April 23, 2024

హైదరాబాద్‌లో భారీ వర్షం

- Advertisement -
- Advertisement -

heavy rain in hyderabad today

హైదరాబాద్ : భాగ్యనగరం వర్షంలో తడిసి ముద్దైంది. పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తుంది. గురువారం తెల్లవారుజాము నుంచే వర్షం కురుస్తోంది. చత్తీస్‌గడ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతోనే వర్షాలు పడుతున్నాయని వాతావరణశాఖ పేర్కొంది.  భారీగా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపైకి నీరు చేయడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పంజాగుట్ట, కూకట్‌పల్లి, కోఠి, అబిడ్స్‌, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బినగర్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, సనత్‌నగర్, కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, ట్యాంక్‌బండ్‌, నాంపల్లి, దారుస్సలాం సహా పలు చోట్ల భారీగా వర్షం దంచి కొడుతోంది. సికింద్రాబాద్‌లోని పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. శుక్రవారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News