Home జగిత్యాల జగిత్యాలలో భారీ వర్షం

జగిత్యాలలో భారీ వర్షం

RAIN

జగిత్యాల : జగిత్యాల జిల్లాలో బుధవారం ఉదయం నుంచి భారీ వర్షం పడుతోంది. ఈ భారీ వర్షంతో ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మామిడి కాయలు రాలిపోవడంతో మామిడి తోట యజమానులు ఆవేదనకు గురయ్యారు. జగిత్యాల, ధర్మపురి, సారంగాపూర్, రాయికల్, కోరుట్ల, మెట్‌పల్లి, వెల్గటూర్, పెగడపల్లితో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈదురు గాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రాజన్న సిరిసిల్లలో కూడా భారీ వర్షం పడుతోంది. భారీ వర్షంతో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు.

Heavy Rain in Jagityala