Home జాతీయ వార్తలు మధ్యప్రదేశ్‌లో వర్ష బీభత్సం : ఆరుగురి మృతి

మధ్యప్రదేశ్‌లో వర్ష బీభత్సం : ఆరుగురి మృతి

RAINSభోపాల్ : మధ్యప్రదేశ్‌లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఝబువా ప్రాంతంలో ఓ ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చనిపోయారు. పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు శిథిలాల కింది నుంచి నాలుగు మృతదేహాలను వెలికి తీశారు.