Home మంచిర్యాల ప్రయాణికుల ఇబ్బందులు పట్టించుకోరా?

ప్రయాణికుల ఇబ్బందులు పట్టించుకోరా?

Heavy rainfall without water for five days

ఆర్‌అండ్‌బి అధికారులపై మంత్రి ఐకె రెడ్డి ఆగ్రహం
తెగిన తాత్కాలిక రోడ్డును పరిశీలించిన మంత్రి, ఎంఎల్‌ఏ

మన తెలంగాణ/జన్నారం : గత ఐదు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి తెగిపోయిన తాత్కాలిక రోడ్ల పరిస్థితిని మంగళవారం రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఖానాపూర్ ఎంఎల్‌ఏ అజ్మీరా రేఖశ్యాం నాయక్‌లు సందర్శించారు. ముందుగా మండలంలోని ఇంధన్‌పల్లి సమీపంలో 1.25 లక్షలతో చేపట్టిన బ్రిడ్జి పనులను వారు పరిశీలించారు. బ్రిడ్జి పనులు జరుగుతున్న వద్ద కనీసం అటెండర్ కూడా లేకపోవడం ఏమిటని ఆర్‌అండ్‌బి ఎస్‌సి నజీర్ అహ్మద్‌పై మంత్రి ఇంద్రకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిడ్జి నిర్మాణంలో ఉంటే ప్రయాణికుల రాకపోకలకు వేసిన తాత్కాలిక రోడ్డు వర్షానికి తెగిపోతే కనీసం మరమ్మతులు చేయించకపోవడంతో ఏమిటని ఇది మీ నిర్లక్షం కాదా అని ప్రశ్నించారు. అనంతరం జన్నారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ సమీపంలోని రహదారిపై రెండున్న కోట్లతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను సైతం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంఎల్‌ఏ రేఖశ్యాంనాయక్‌లు పరిశీలించారు. బ్రిడ్జి కాంట్రాక్టర్ వెంకట్రావ్‌ను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మందలించారు. జన్నారం మండల కేంద్రానికి ఇరువైపులా రాకపోకలు నిలిచిపోతుంటే అధికారులు ప్రేక్షకపాత్ర పోషించడం పట్ల మంత్రి ఆసహనం వ్యక్తం చేశారు. ఈ రోజు ఇంధన్‌పల్లి, జన్నారం బ్రిడ్జిల వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డును వర్షం వచ్చిన తెగిపోకుండా పకడ్బందీ మరమ్మతులు చేయించాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రయాణికుల ఇబ్బందులను తీర్చడమే ద్యేయంగా పని చేయాలన్నారు. ఈ తాత్కాలిక రోడ్లపై కొన్ని రోజుల పాటు భారీ వాహనాలు కాకుండా చిన్న చిన్న వాహనాలే నడిచే విధంగా చూడాలన్నారు. ఈ బ్రిడ్జి పనులు శరవేగంగా ప్రారంభించి ఆగస్టు చివరి లోగా పూర్తి చేయిస్తానని ఎస్‌సి నజీర్ అహ్మద్ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి హామీ ఇచ్చారు. వారి వెంట నిర్మల్ ఎస్‌సి శశీధర్‌రాజు సారంగపూర్‌మాజీ ఎంపిపి సత్యనారాయణ గౌడ్, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు రాంకిషన్‌రెడ్డి, పెంబి టిఆర్‌ఎస్ మండలాధ్యక్షులు పుప్పాల శంకర్, జన్నారం మార్కెట్ కమటీ చైర్మన్, వైస్ చైర్మన్ ముత్యం సతీష్, సుతారి వినయ్‌కుమార్, టిఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి జాడి గంగాధర్, జిల్లా అధికార ప్రతినిధి భరత్‌కుమార్, టిఆర్‌ఎస్ నాయకులు సిహెచ్ సత్యం, బాలసాని శ్రీనివాస్‌గౌడ్, గర్రెపల్లి హరీష్‌గౌడ్, ముత్యం సాయి క్రిష్ణ, సుల్వ జనార్థన్, రావుల శంకర్, చింతల వెంకటాచలం, పొన్కల్ సిలింగ్ విండో చైర్మన్ బాల్తా రాజమౌళి, తదితరులు పాల్గొన్నారు.