Home అంతర్జాతీయ వార్తలు పాక్‌లో భారీ వర్షాల ధాటికి 50 మంది మృతి

పాక్‌లో భారీ వర్షాల ధాటికి 50 మంది మృతి

RAINSఇస్లామాబాద్: పాక్‌లో గత కొద్దిరోజులుగా ఎడతేరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల కారణంగా వచ్చిన వరదల ఉధృతితో సంభవించిన ప్రమాదాల్లో ఇప్పటివరకు 50 మంది మృతి చెందినట్లు సమాచారం. మరో 47 మంది తీవ్రగాయాలపాలయ్యారు. వరదలు పోటెత్తడంతో వేల సంఖ్యల్లో ప్రజలు నిరాశ్రయులైయ్యారు. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.