Search
Thursday 15 November 2018
  • :
  • :

భారీ వర్షాలు పడే అవకాశం

RAINSహైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వారు వెల్లడించారు. దీని ప్రభావంతో వచ్చే రెండు, మూడు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మూడు ప్రాంతాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. మరోవైపు ఒకట్రెండు రోజుల్లో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు వ్యాపించి, పూర్తిగా విస్తారిస్తాయని వెల్లడించారు.

Comments

comments