Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

బీహార్, ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు

పిడుగులు పడి 77 మంది మృతి, అనేక మంది గాయాలు, మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు

lightningపాట్నా/లక్నో: బీహార్, ఉత్తరప్రదేశ్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండడంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయ మయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది. రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. ఇరు రాష్ట్రాల్లో వర్షాలకు తోడు పిడుగులు బీభత్సాన్ని సృష్టించాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి గత 48 గంటల్లో పిడుగుల ధాటికి 77 మంది మృతి చెందినట్లు విపత్తు నిర్వహణ అధికారులు బుధవారం పేర్కొన్నారు. బీహార్‌లో మంగళవారం రుతు పవనాలు ప్రవేశించాయి. వాటి రాకతో రాష్ట్రంలో కుండపోత వర్షం కురుస్తోంది. రాత్రి మొత్తం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం, దానితోడు పిడుగులు పడడంతో ఒక్క రోజే 57 మంది మృత్యువాత పడినట్లు సీనియర్ అధికారులు వెల్లడించారు. ఉరుము లతో కూడిన భారీ వర్షాలు పడడంతో 57 మృతి చెందడంతో పాటు మరో 24 మంది గాయపడ్డారని విపత్తు నిర్వహణ ప్రిన్సిపల్ సెక్రెటరీ వ్యాస్జీ మీడి యాకు వెల్లడించారు. పాట్నా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఐరుగురు మృతి చెందగా, బస్కర్ జిల్లాలో మరో ఐదుగురు మరణించారని చెప్పారు. నలంద, భోజాపూర్, రోహత్స్, కైమూర్, ఔరంగాబాద్, పూర్ణియాలో నలుగురేసి చెప్పున, కతిహర్, సహస్రా, సరన్ జిల్లాల్లో ముగ్గురేసి చొప్పున చనిపోయి నట్లు నివేదికలు వచ్చాయన్నారు. భగల్‌పూర్, ముంగేర్, సమస్తిపూర్ జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున, బెంక, మధేపురా, ముఝఫర్‌పూర్, పశ్చిమ చంపరన్ జిల్లాల్లో ఒక్కరేసి చొప్పున ప్రాణాలు వదిలినట్లు ఆయన తెలిపారు. అదే విధం గా ఇతర ప్రాంతాల్లో మరో ముగ్గురు మరణించారన్నారు. కాగా, 13 పశు వులు కూడా చనిపోయాయన్నారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియాను ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. కొన్ని కుటుంబాలకు ఇప్పటికే ఆర్థిక సహాయం అందించామని చెప్పారు. క్షతగాత్రులకు గాయ తీవ్రతనుబట్టి ఎక్స్‌గ్రేషియాను నిర్ణయిస్తామన్నారు. అయితే బీహార్‌లో జూన్-అక్టోబర్ మధ్య వర్షాలతో పాటు పిడుగులు పడడం సాధారణమే. దీంతో మరో రెండు రోజుల్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఇదిలా ఉండగా, రాజధాని పాట్నా శివార్లలోని నౌబత్‌పూర్ బ్లాక్‌ల్‌లో పిడుగు పడడంతో 30.5 మీటర్ల మేరకు 8 ఫీట్ల లోతులో భూమి బీటలు వారినట్లు జిల్లా మేజిస్ట్రేట్ సంజయ్ కుమార్ అగర్వాల్ ధృవీకరించారు. పొరుగు రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో గత రెండు రోజులుగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తుండడంతో 20 మంది మరణించారు.
ప్రధాని విచారం: బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్‌తో పాటు దేశంలో భారీ వర్షాలు, పిడుగులుపడి అనేక మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని తాను కోరుకుంటున్నానని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు.

Comments

comments