Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

బ్రెజిల్‌లో భారీ వర్షాలు : 19 మంది మృతి

RAINSసావోపోలో : బ్రెజిల్ ఆర్థిక రాజధాని సావోపోలో, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాలు , వరదలు నగరాన్ని ముంచెత్తడంతో గత రాత్రి 19 మంది మృతి చెందారు. రెండేళ్లలో కరవు తరువాత భారీ వర్షాలు కురిశాయి. కొండచరియలు విరిగి పడి 17 మంది, నీట మునిగి మరో ఇద్దరు మృత్యువాత పడినట్లు అదికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వారు పేర్కొన్నారు. వీధుల్లో భారీగా నీరు నిలవడంతో సహాయక సిబ్బంది పడవల ద్వారా సహాయక చర్యలు చేపట్టారు. సావోపో అంతర్జాతీయ విమానాశ్రయంలో వర్షాల కారణంగా విమనాలు ఆరు గంటలు ఆలస్యంగా నడిచాయి. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Comments

comments