Home జాతీయ వార్తలు ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు

ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు

Delhi : Heavy Rains

ఢిల్లీ : ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి భారీ వర్షాలు పడుతుండడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అల్పపీడన ప్రభావంతో ఈ భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ఢిల్లీలోని లోతట్టు ప్రాంత ప్రజల జీవనం అస్తవ్యస్థమైంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Heavy Rains in Delhi