Home జాతీయ వార్తలు ఇటలీలో భారీ వర్షాలు : ఆరుగురి మృతి

ఇటలీలో భారీ వర్షాలు : ఆరుగురి మృతి

FLOODSరోమ్ : ఇటలీలో గత మూడు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోలియా నామకరణం చేసిన తుపాను కురుస్తున్న వర్షాల వల్ల ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందారు. తీవ్రమైన ఈదురుగాలుల కారణంగా భారీ వృక్షాలు నేలకూలడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. విద్యుత్ సరఫరా లేక లక్షలాది మంది ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. వెనెటో ప్రాంతంలో గంటకి 80కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. రహదారులు నీటమునగడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. సహాయక సిబ్బంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.