Home అంతర్జాతీయ వార్తలు జపాన్‌లో భారీ వర్షాలు : 15మంది మృతి

జపాన్‌లో భారీ వర్షాలు : 15మంది మృతి

HEAVY-RAINS

టోక్యో : జపాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా భారీ వరదలు సంభవించి ఇప్పటి వరకు 15 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. మరో 15 మంది గల్లంతయ్యారు. దక్షిణ దీవుల్లోని క్యుషూ ప్రాంతంలో నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రోడ్లు, ఇళ్లు వరదల్లో కొట్టుకపోతున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వరదబాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని అధికారులు వెల్లడించారు.

Heavy rains in Japan: 15 killed